క్రేజీ బ్యూటీ సాయి పల్లవి “లవ్ స్టోరీ” ఈ రోజు రిలీజ్ అవుతుంది. మరి ఆమె ఎంతో నచ్చి చేసిన సినిమా “విరాటపర్వం” పరిస్థితి ఏమిటి ? ఈ సినిమా ఎప్పుడో గతేడాదే రిలీజ్ కావాలి. కానీ ఇప్పటి వరకూ రిలీజ్ పై స్పష్టత కూడా లేదు. మరి, “విరాట పర్వం” టీమ్ ఏమి చేస్తోంది ? మరోపక్క ఈ సినిమాని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కి అమ్మేశారని వార్తలు వస్తున్నాయి.
నిజానికి నెట్ ఫ్లిక్స్ తో హీరో రానాకి మంచి అనుబంధం ఉంది. గత ఏడాది తమ సంస్థలో నిర్మించిన “కృష్ణ అండ్ హిజ్ లీల” చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ కి మంచి రేట్ కి అమ్మేశాడు. ఇక ఈ మధ్య “రానా నాయుడు” అంటూ ఓ వెబ్ సిరీస్ ను కూడా నెట్ ఫ్లిక్స్ కోసం చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే “విరాటపర్వం” కూడా నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చేయాలని రానా చాలా ప్రయత్నం చేశాడు.
కానీ డైరెక్ట్ డిజిటల్ విడుదలకు ఒప్పుకుంటే తనకు కొన్ని సమస్యలు వస్తాయని ఆ ఒప్పందాన్ని రద్దు చేశాడు సురేష్ బాబు. ఎలాగూ “లవ్ స్టోరీ” సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. సాయి పల్లవి క్రేజ్ ఆ సినిమాకి ఎంత వరకు ఉపయోగ పడుతుందో చూసి.. అప్పుడు విరాటపర్వం చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చెయ్యాలా ?
లేక డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లోనే రిలీజ్ చెయ్యాలా అని డిసైడ్ అవుదామని సురేష్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది. కాబట్టి, ఈ రోజు థియేటర్ లో రిలీజ్ అవుతున్న లవ్ స్టోరీ కలెక్షన్స్ ను బట్టి, విరాట పర్వం రిలీజ్ ఆధారపడి ఉంది.
కాగా రానా, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రంలో రానా నక్సలైట్ గా, సాయి పల్లవి అతని ప్రేయసి గా నటించింది. పైగా సాయి పల్లవి చుట్టే కథ తిరుగుతుందని టాక్.