
మాజీ లవర్ బాయ్ సిద్ధార్థ్ లండన్ లో సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ గత కొన్ని రోజులుగా మీడియాకి దూరంగా ఉంటున్నాడు. ఎందుకు అని ఫ్యాన్స్ ఆరా తీయగా… అసలు విషయం తెలిసింది. సిద్ధార్థ్ కు సర్జరీ జరిగిందట. పైగా లండన్ వెళ్లి మరీ సిద్ధార్థ్ సర్జరీ చేయించుకున్నాడట.
అయితే, ఆ సర్జరీ దేనికి సంబంధించినది అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోన్న సమాచారం ప్రకారం సిద్ధార్థ్ పేస్ సర్జరీ చేయించుకున్నాడు. పెరిగిన వయసు రీత్యా మొహం పై కొన్ని ముడతలు వచ్చాయి. అందుకే ఆ ముడతలు పోవడానికి సిద్ధార్థ్ ఈ సర్జరీ చేయించుకున్నాడు.
అందుకే, సిద్ధార్థ్ ఈ విషయం బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడట. సహజంగా సిద్ధార్థ్ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాడు. కానీ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు షేర్ చేయలేదు. అయినా సిద్ధార్థ్ తన పేస్ సర్జరీ గురించి చెప్పడానికి ఇష్టపడట్లేదు.
అందుకే ఈ విషయం పై ప్రస్తావించలేదు. ఇక బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని లవర్ బాయ్ ఇమేజ్ కూడా సాధించిన ఈ హీరో, గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ లేక, తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. హిట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
కానీ, సిద్ధార్థ్ ఆశించిన సక్సెస్ మాత్రం రాలేదు. తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నా.. అక్కడ సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఇక తెలుగులో సుదీర్ఘ విరామం తర్వాత ‘మహా సముద్రం’ సినిమాతో తెలుగులోకి రిఎంట్రీ ఇస్తున్నాడు.