Pawan Kalyan Suresh Babu : టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ ప్రారంభమైన కొత్తల్లో పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘గోపాల గోపాల’.. ఇందులో పవన్ కళ్యాణ్ శ్రీ కృష్ణుడి పాత్రలో నటించగా.. వెంకటేష్ నాస్తికుడిగా నటించాడు..బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘ఓ మై గాడ్’ చిత్రానికి ఇది రీమేక్.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాని వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు నిర్మించాడు..అయితే అప్పట్లో ఈ సినిమా షూటింగ్ సమయం లో పవన్ కళ్యాణ్ తో సురేష్ బాబు కి కొన్ని క్లాషెస్ జరిగాయని..డేట్స్ విషయం లో పవన్ కళ్యాణ్ తో గొడవలయ్యాయి అని ఇలా పలు రకాల వార్తలు వచ్చాయి..అయితే ఈ విషయం పై సురేష్ బాబు ఇటీవల ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు.
ముందుగా యాంకర్ మాట్లాడుతూ ‘గోపాల గోపాల మూవీ సమయం లో మీకు పవన్ కళ్యాణ్ కి గొడవలు వచ్చాయట కదా..నిజమేనా’ అని అడుగుతాడు..అప్పుడు సురేష్ బాబు దానికి సమాధానం చెప్తూ ‘అదేదో చిన్న గొడవ వచ్చింది లేండి..ఇప్పుడు మా మధ్య ఏమి లేవు..మేము మంచి స్నేహితులం’ అని సమాధానం ఇచ్చాడు.
‘పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంపై మీ అభిప్రాయం ఏమిటి?’ అని సురేష్ బాబుని యాంకర్ అడగగా.. సురేష్ బాబు సమాధానం చెప్తూ ‘ఆయనకి సమాజంలో జరిగే అన్యాయం గురించి పోరాడాలి అనే లక్షణం నేను మొదటి నుండి చూస్తూనే ఉన్నాను..మార్పు తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నాడు..ఒక స్నేహితుడిగా ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు..ఇక ఆ తర్వాత రాజకీయాల్లో మీ సపోర్టు ఎవరికీ ఉంటుంది అని యాంకర్ అడగగా,’సినిమా ఇండస్ట్రీ కేవలం ఒక పార్టీ కి మాత్రమే ఎప్పుడూ సపోర్టు ఉండదు.. మేము ప్రభుత్వానికే సపోర్టుగా ఉంటాము’ అంటూ చెప్పుకొచ్చాడు.