https://oktelugu.com/

Adivi Sesh: అక్కినేని వారి అమ్మాయితో అడివి శేష్ పెళ్లి?

అడివి శేష్ అక్కినేని కుటుంబానికి చెందిన సుప్రియ యార్లగడ్డతో రిలేషన్ లో ఉన్నారనేది టాక్. కొన్నేళ్లుగా వీరిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. గూఢచారి చిత్రంలో సుప్రియ కీలక రోల్ చేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 20, 2023 / 09:15 AM IST

    Adivi Sesh

    Follow us on

    Adivi Sesh: హీరో అడివి శేష్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. క్షణం మూవీతో హీరోగా బ్రేక్ అందుకున్న అడివి శేష్ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఆయన నటించిన గూఢాచారి, ఎవరు?, మేజర్ ప్రేక్షకులను మెప్పించాయి. మేజర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ చిత్రాన్ని మహేష్ బాబు నిర్మించడం విశేషం. లేటెస్ట్ రిలీజ్ హిట్ 2 సైతం విజయం అందుకుంది. అడివి శేష్ మూవీ అంటే కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఆయన గూఢచారి చిత్ర సీక్వెల్ చేస్తున్నారు.

    కాగా అడివి శేష్ అక్కినేని కుటుంబానికి చెందిన సుప్రియ యార్లగడ్డతో రిలేషన్ లో ఉన్నారనేది టాక్. కొన్నేళ్లుగా వీరిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. గూఢచారి చిత్రంలో సుప్రియ కీలక రోల్ చేశారు. అప్పుడు మొదలైన వీరి పరిచయం రిలేషన్ కి దారి తీసిందంటున్నారు. అడివి శేష్ అక్కినేని ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా కనిపిస్తున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో సుప్రియతో పాటు సందడి చేశారు. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి సుప్రియ-అడివి శేష్ జంటగా హాజరయ్యారు.

    జరుగుతున్న ప్రచారం నిజమే సుప్రియ, అడివి శేష్ రిలేషన్ లో ఉన్నారన్న మాట వినిపిస్తోంది. కాగా ఈ జంట పెళ్ళికి సిద్ధమయ్యారట. పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా దీనిపై హింట్ ఇచ్చేశారట. ఆయన సుప్రియ మెడలో మూడు ముళ్ళు వేయడం ఖాయమంటున్నారు. టాలీవుడ్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ఉంది.

    సుప్రియ ఏజ్ 41. ఆమెకు గతంలో చరణ్ రెడ్డి అనే వ్యక్తితో వివాహం జరిగింది. అనంతరం మనస్పర్థలతో విడిపోయారు. అప్పటి నుండి ఆమె సింగిల్ గా ఉంటున్నారు. 1996లో సుప్రియ హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో ఆమె హీరోయిన్ గా చేశారు. తర్వాత సుప్రియ హీరోయిన్ గా చిత్రాలు చేయలేదు. హీరో సుమంత్ కి సుప్రియ చెల్లెలు. నాగార్జున మేనమామ అవుతాడు.