Mahesh Babu: మరో పసిబిడ్డ ప్రాణాలను కాపాడిన సూపర్ స్టార్ మహేష్.. చేతులెత్తి దండం పెడుతున్న నెటిజెన్స్

రీసెంట్ గా మహేష్ బాబు మరో రెండేళ్ల మెగా బిడ్డ ప్రాణాలను కాపాడాడు.కోనసీమ జిల్లా అమలాపురం కి చెందిన కార్తికేయ అనే రెండేళ్ల పసి బిడ్డ గత కొంతకాలం నుండి గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. బాధ గుండెల్లో రంద్రం నుండి,అత్యవసరం గా బిడ్డకి సర్జరీ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. తల్లితండ్రులకు ఉన్న ఆర్ధిక పరిస్థితి కి సర్జరీ చేయించలేరు.

Written By: Vicky, Updated On : May 31, 2023 3:03 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: వెండితెర పై అద్భు మైన పాత్రలను పోషించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొని సూపర్ స్టార్ గా ఎదిగిన వ్యక్తి మహేష్ బాబు. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈయన మహేష్ బాబు తండ్రి కృష్ణ అని చెప్పుకునే స్థాయికి ఎదిగాడు.అయితే ఈయన కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, బయట కూడా రియల్ హీరో అని ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఈయన చేసినన్ని సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరో కూడా చెయ్యలేదని చెప్పొచ్చు.

తాను సంపాదించిన డబ్బులతో కొంతభాగం మహేష్ బాబు ఫౌండేషన్ కి ఇచ్చి చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తుంటారు మహేష్.ఇప్పటి వరకు వెయ్యి కి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన మహానుభావుడు ఆయన. కానీ ఈ విషయాల గురించి బయట ఎక్కడా కూడా చెప్పుకోదు మహేష్, ఆయన ద్వారా సహాయం పొందిన వాళ్ళు చెప్తే తప్ప ఈ విషయాలు ఎప్పటికీ బయటకి రావు.

ఇక రీసెంట్ గా మహేష్ బాబు మరో రెండేళ్ల మెగా బిడ్డ ప్రాణాలను కాపాడాడు.కోనసీమ జిల్లా అమలాపురం కి చెందిన కార్తికేయ అనే రెండేళ్ల పసి బిడ్డ గత కొంతకాలం నుండి గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. బాధ గుండెల్లో రంద్రం నుండి,అత్యవసరం గా బిడ్డకి సర్జరీ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. తల్లితండ్రులకు ఉన్న ఆర్ధిక పరిస్థితి కి సర్జరీ చేయించలేరు. ఎలా చెయ్యాలి అని గుండెలు బాదుకుని ఏడుస్తున్న సమయం లో చుట్టుపక్కన ఉన్నవాళ్లు వెంటనే మహేష్ బాబు ఫౌండేషన్ కి వెళ్ళండి, అక్కడ వైద్యం ఉచితంగా చేస్తారని చెప్పారట.

వాళ్ళ సహాయసహకారాలతో మహేష్ బాబు ఫౌండేషన్ నిర్వాహకులను కలవగా, వాళ్ళీ అన్నీ పరిశీలించిన తర్వాత ఆంధ్ర హాస్పిటల్ కి ఫోన్ చేసి ఆ రెండేళ్ల బాబు ప్రాణాలను కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ మరియు నెటిజెన్స్ మహేష్ గొప్ప మనసుకి చేతులెత్తి దండం పెడుతున్నారు.