Rajamouli and Mahesh Babu : తెలుగులో రాజమౌళి (Rajamouli) చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా ప్రత్యేకంగా భారీ మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu)తో చేస్తున్న సినిమా కోసం అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక పాన్ వరల్డ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా(Priyanka Chopra)నటిస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈమె తో పాటు మరొక హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటి ని కూడా రంగంలోకి దింపుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్ (Prudhvi raaj sukumaran) నటించబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఎవరికి ఎలాంటి హింట్ ఇవ్వకుండా సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసిన రాజమౌళి అంతే రహస్యంగా సినిమా షూట్ ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా నుంచి ఒక్క లీక్ ని కూడా బయటికి వదలకుండా చాలా గోప్యంగా ఉంచుతున్నాడు. దానికి కారణం ఏదైనా కూడా రాజమౌళి చేస్తున్న ఈ భారీ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక 1000 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 3,000 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుందనే అంచనాలో సినిమా మేకర్స్ అయితే ఉన్నారు…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మూడు పార్టులుగా రాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక మొదటి పార్ట్ పూర్తయిన తర్వాత సెకండ్ పార్ట్ ని తెరకెక్కిస్తారా? లేదంటే మధ్యలో గ్యాప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటికే మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు మహేష్ బాబు డేట్స్ మొత్తాన్ని రాజమౌళి తీసుకున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఇతర టెక్నీషియన్స్ నుంచి కూడా నాన్ డిస్ క్లోజ్ అగ్రిమెంట్ (NDA) ని చేసుకున్న రాజమౌళి ఈ ప్రాజెక్టు నుంచి ఎవరూ కూడా బయటకు వెళ్లడానికి ప్రసక్తి లేకుండా భారీ రెమ్యూనరేషన్స్ ను ఇప్పించి మరి అగ్రిమెంట్ అయితే చేసుకున్నాడు. మరి రాజమౌళి అనుకుంటున్నాట్టుగానే ఈ సినిమా మూడు భాగాలుగా తెరకెక్కబోతుందా లేదంటే ఒక భాగంతోనే సరిపెడతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం రాజమౌళి ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పటికే ప్రభాస్ 5 సంవత్సరాల పాటు బాహుబలి(Bahubali) సినిమా కోసం తన సమయాన్ని కేటాయించాడు. మరి మహేష్ బాబు సైతం అలానే ఈ సినిమా కోసం కేటాయించబోతున్నాడా? ఒక మూడు నాలుగు సంవత్సరాల వరకు మహేష్ బాబు ను మనం థియేటర్ లో చూడలేమా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…