Mahesh Babu: అసాధ్యం ని సుసాధ్యం చేయగల దర్శకులు మన ఇండియాలో కేవలం ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘మగధీర’ చిత్రంతో ఆయన మన తెలుగు సినిమా స్థాయిని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ‘బాహుబలి’ చిత్రంతో మన స్థాయిని అంతర్జాతీయ మర్కెట్స్ లోకి తీసుకెళ్లి తెలుగోడి సత్తా చాటాడు. ఇప్పుడు #RRR చిత్రంతో ఏకంగా హాలీవుడ్ లోనే మన తెలుగు సినిమాకి మార్కెట్ ఓపెన్ చేసాడు. మన సినీ ఇండస్ట్రీ ఇంత రేంజ్ కి వెళ్తుందని కలలో అయినా ఊహించామా?, అదంతా రాజమౌళి వల్లనే సాధ్యపడింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని కొన్ని సందర్భాలలో ఉపయోగిస్తుంది.
డీ ఏజినింగ్ తో మన స్టార్ హీరోలను ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి యంగ్ గా చూపించడం, అలాగే చనిపోయిన లెజెండ్స్ ని ఈ టెక్నాలజీ ద్వారా మళ్ళీ వెండితెర పై చూపించే ప్రయత్నం చేయడం వంటివి ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా విడుదలైన తమిళ హీరో విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రంలో ఇటీవలే చనిపోయిన తమిళ సీనియర్ హీరో/రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయ్ కాంత్ ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ని ఉపయోగించి చూపించారు. ఆడియన్స్ కి ఈ సర్ప్రైజ్ సరికొత్త థ్రిల్ ని ఇచ్చింది. ఈ టెక్నాలజీ మన ఇండియన్ సినిమాలో ఇప్పుడిప్పుడే వాడుతున్నారు కానీ, హాలీవుడ్ లో ఈ టెక్నాలజీ ఈమధ్య ప్రతీ సినిమాకి ఉపయోగిస్తున్నారు. అలా హాలీవుడ్ రేంజ్ స్టాండర్డ్స్ తో రాజమౌళి త్వరలో మహేష్ బాబు తో తియ్యబోయే సినిమా కోసం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ని ఉపయోగించబోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి క్యారక్టర్ కోసం, సూపర్ స్టార్ కృష్ణ ని నటింపచేయబోతున్నారట. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ తో నిజంగా సూపర్ స్టార్ కృష్ణ దిగి వచ్చి నటించాడా అనే రేంజ్ లో సహజంగా చూపించబోతున్నాడట.
వాస్తవానికి ఇలాంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే రాజమౌళి ‘యమదొంగ’ సినిమాలో ఇలాంటి ప్రయత్నం చేసాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక పాటలో సీనియర్ ఎన్టీఆర్ దిగి వచ్చినట్టు చూపిస్తాడు. చాలా సహజంగా నిజంగా పెద్దాయన దిగి వచ్చి నటించాడా? అనే రేంజ్ లో ఆ సన్నివేశం ఉన్నింది. ఇప్పుడు మహేష్ తో తియ్యబోయే సినిమాలో ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకోనుంది. దానికి ముందే మూవీ టీం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేస్తారట. తన ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు, కథ మొత్తం చెప్పే అలవాటు ఉన్న రాజమౌళి, ఈ సినిమాకి కూడా అదే చేయబోతున్నాడు.