Superman OTT Release Date: ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ ఇండస్ట్రీ కి గొప్ప గుర్తింపు ఉంది. ఈ సినిమాకి వరల్డ్ లో ఉన్న ప్రతి ప్రేక్షకుడి నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంటుంది. ఇండియాలో హాలీవుడ్ మూవీస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ ఇయర్ జూలైలో రిలీజ్ అయిన ‘సూపర్ మ్యాన్’ సినిమా ఈనెల 11వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో హాట్ స్టార్ నుంచి స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
ఈ సిరీస్ నుంచి వచ్చిన ప్రతి మూవీ సూపర్ సక్సెస్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే హాలీవుడ్ టెక్నీషియన్స్ మైమరపింపజేసే విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక సూపర్ మ్యాన్ కి ఉన్న అతీతమైన శక్తులతో ప్రపంచాన్ని ఎలా కాపాడుతున్నాడు అనేది ప్రేక్షకుడి యొక్క ధోరణిలో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.
కాబట్టే ఈ సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి. ఇక జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతున్న ఉన్న ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబోతోంది. ఓటీటీ లో ప్రేక్షకులు ఈ సినిమాని భారీ ఎత్తున ఆదరిస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… 225 మిలియన్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 616 మిలియన్ల కలెక్షన్స్ ను సాధించింది… మొత్తానికైతే ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల యొక్క మన్ననలను పొందడమే కాకుండా గొప్ప విజయాన్ని సాధించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
ఇక ఈ సిరీస్ నుంచి మరో సినిమా ఎప్పుడు రాబోతోంది అనేది కూడా మేకర్స్ తొందర్లోనే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి థియేటర్ లో ఆదరించిన ఈ సినిమాకి ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది…ఇక ఈనెల లోనే ‘అవతార్ 3’ సినిమా రిలీజ్ కి రెడీ ఉన్న నేపధ్యంలో ఈనెల మొత్తం హాలీవుడ్ సినిమాల ప్రభావమే జనాల మీద ఉండబోతోందనేది చాలా క్లారిటీ గా తెలుస్తోంది…