Super Star Krishna Birthday Treat: ‘సూపర్ స్టార్ మహేష్ బాబు’కు ఓ అలవాటు ఉంది. తన తండ్రి కృష్ణ పుట్టిన రోజున ఫ్యాన్స్ కు ఏదొక గిప్ట్ ఇవ్వడం మహేష్ కి ఒక అనవాయితీగా వస్తూ ఉంది. మరి, మే 31న కృష్ణ పుట్టిన రోజు. కాబట్టి, మహేష్ ఆ రోజు ఏ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు ? కృష్ణ ప్రతి పుట్టిన రోజుకూ మహేష్ తన సినిమాకి సంబంధించి ఒక క్రేజ్ అప్ డేట్ ను రివీల్ చేస్తాడు.

తన అభిమానులకు ఫుల్ కిక్ ను ఇస్తూ ఉంటాడు. అలాగే, ఈ సారి కూడా అలాంటి కిక్ ఏమైనా ఉందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఈసారి మహేష్ ఏం చేయబోతున్నాడు ? త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.

Also Read: Indravathi Chauhan: ‘ఊ అంటావా’ అనడమే కాదు.. అందంతో ఊపేయడం ఈ సింగర్ కు తెలుసు!
అలాగే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ కాంబో కోసం చాలా ఏళ్లుగా ఫ్యాన్స్ వెయిటింగ్. అందుకే, మే 31వ తేదీన ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ 31న ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకనట వస్తే.. ఫ్యాన్స్ కు అద్భుతమైన పండగే అవుతుంది. మరోవైపు మహేష్ తన ఫ్యామిలీతో కలిసి తన విదేశాల ప్రయాణంలో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఏది ఏమైనా ప్రతి ఏడాది తన తండ్రి పుట్టిన రోజున అభిమానులకు ట్రీట్ ఇవ్వడం అనేది మహేష్ కి సెటిమెంట్. తన కొత్త సినిమా టీజర్ రూపంలోనో, లేదా కనీసం తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ తోనే, ఏది కుదరకపోతే ఆ సినిమాలో తన లుక్ ను రివీల్ చేసే ఒక పోస్టర్ ను రిలీజ్ చేసో మహేష్ మొత్తానికి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తాడు.
మరి చూడాలి, తన నుంచి రానున్న సినిమాల గ్లింప్స్ రిలీజ్ అవుతాయో, లేక పోస్టర్లు రిలీజ్ అవుతాయో చూడాలి. కచ్చితంగా త్రివిక్రమ్ సినిమా నుండే కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న మహేష్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు.
Also Read: Reduced Petrol, Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధర తగ్గించని ఏపీ సర్కారు? కేంద్ర సూచనలు బేఖాతరు
Recommended videos
[…] […]