Super Machi Movie Review మూవీ రివ్యూ :’సూపర్ మచ్చి’   

కథ, దర్శకత్వం : పులి వాసు స్క్రీన్ ప్లే : పులి వాసు నిర్మాతలు :  రిజ్వాన్, ఖుషి సంగీతం :  థమన్ సినిమాటోగ్రఫర్ : శ్యామ్ కె. నాయుడు ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్ నటీనటులు : కళ్యాణ్ దేవ్,ర‌చితా రామ్‌, తనికెళ్ళ భరణి,అజయ్  తదితరులు. కల్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన కొత్త చిత్రం సూపర్ మచ్చి పులి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా  నిర్మించారు.ర‌చితా రామ్‌ హీరోయిన్ గా నటించింది. మరి ఈ […]

Written By: Shiva, Updated On : January 14, 2022 3:16 pm
Follow us on

కథ, దర్శకత్వం : పులి వాసు

స్క్రీన్ ప్లే : పులి వాసు

నిర్మాతలు :  రిజ్వాన్, ఖుషి
సంగీతం :  థమన్

సినిమాటోగ్రఫర్ : శ్యామ్ కె. నాయుడు

ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్

నటీనటులు : కళ్యాణ్ దేవ్,ర‌చితా రామ్‌, తనికెళ్ళ భరణి,అజయ్  తదితరులు.

కల్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన కొత్త చిత్రం సూపర్ మచ్చి పులి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా  నిర్మించారు.ర‌చితా రామ్‌ హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

Super Machi Review and Rating

Super Machi Movie Review మూవీ రివ్యూ :  ‘సూపర్ మచ్చి’

– కథ : 
రాజు (కళ్యాణ్ దేవ్) అతి సాధారణ సింగర్.  చిన్నపాటి రెస్టారెంట్ లో పాటలు పాడుతూ ఉంటాడు. ఇక మీనాక్షి (ర‌చితా రామ్‌) ఒక  సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్.  అయితే,రాజును ఆమె ప్రేమిస్తుంది.అసలు రాజు ఎలా ఉంటాడో కూడా చూడకుండానే మీనాక్షి అతన్ని ఘాడంగా ప్రేమిస్తుంది. ఆ తర్వాత రాజు గురించి తెలుసుకుని, ప్రపోజ్ చేసి అతని ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటుంది. అయితే,ఆమె ప్రేమ పై సరైన అభిప్రాయం లేని రాజు,మీనాక్షిని వదిలించుకోవడానికి  ఆమెను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు.ఇంతకీ, మీనాక్షి రాజును అసలు చూడకుండానే ఎలా ప్రేమించింది ? ఎందుకు  ప్రేమించింది ?  చివరకు రాజు ఆమె ప్రేమను అర్ధం చేసుకున్నాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

Super Machi Movie Story

విశ్లేషణ :
ఈ సినిమా దర్శకుడు పులి వాసు రాసుకున్న సున్నితమైన కథాంశం ఆకట్టుకుంది.ముఖ్యంగా ప్రేమ కోసం ఓ అమ్మాయి పడే ఆవేదన చాలా ఎమోషనల్ గా చూపించాడు. ఇక కొన్ని భావోద్వేగాలు బాగున్నాయి.హీరోగా కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో ఆకట్టుకున్నాడు. కళ్యాణ్ దేవ్ లుక్స్  అండ్ పర్ఫామెన్స్ బాగున్నాయి. కానీ ఎక్స్ ప్రెషన్స్  విషయంలో ఇంకొంచెం శ్రద్ద పెడితే బాగుంటుంది. ఇక  హీరోయిన్ ర‌చితా రామ్‌ తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.

హీరోయిన్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటన కాస్త ఓవర్ గా ఉంది.హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన కమెడియన్స్ భద్రం, జబర్దస్త్ మహేష్, పోసాని  తమ  కామెడీ టైమింగ్‌ తో నవ్వించారు.అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించే ప్రయత్నం చేశారు.అయితే, సినిమాలో చాలా లొసుగులు ఉన్నాయి.

సింపుల్ పాయింట్ తో సినిమా మొత్తం చుట్టేయడం,అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని ఇంట్రెస్ట్ గా ఎలివేట్ చేయలేకపోవడం,దీనికితోడు ఆడియన్స్ కి మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటి కారణాల కారణంగా మొత్తానికి ఈ సినిమా ఆకట్టుకోదు.

-ప్లస్ పాయింట్స్ :

కొన్ని లవ్ సీన్స్,

నేపథ్య సంగీతం,

పాట‌లు
-మైనస్ పాయింట్స్ :

రెగ్యులర్ ప్లే,

రొటీన్ డ్రామా,

లవ్ ట్రాక్,

లాజిక్స్ మిస్ అవ్వడం,

బోరింగ్ ట్రీట్మెంట్,

-సినిమా చూడాలా? వద్దా? 
‘వెరీ ఎమోషనల్ లవ్ డ్రామా’ అంటూ వచ్చిన ఈ బోరింగ్ అండ్ రొటీన్ డ్రామాలో రెగ్యులర్ వ్యవహారాలు తప్పా.. ఇంట్రెస్టింగ్ కహానీలు ఏమీ లేవు.  మొత్తమ్మీద ఈ ‘సూపర్ మచ్చి’ లో సూపర్ ఏమి లేదు.కాబట్టి ఈ సినిమా చూడక్కర్లేదు.
oktelugu.com రేటింగ్:  2/ 5