Super Krishna Support Actors: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు కొంతమంది అప్ కమింగ్ నటులకు సహాయం చేస్తుంటారు. అలా హీరోల నుంచి సాయం పొందిన నటులు ఇండస్ట్రీలో రాణిస్తూ ముందుకు దూసుకెళ్తుంటారు. ఇతర నటులకు, టెక్నీషియన్స్ కి హెల్ప్ చేసేవాళ్లలో సూపర్ స్టార్ కృష్ణ ముందు వరుసలో ఉండేవారు. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లను ఆర్టిస్టులను కాపాడుకుంటూ వచ్చాడు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే చాలు ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ వాళ్లకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ఇంట్రెస్ట్ చూపించేవారు. తనతో సినిమ్ చేసి ప్రొడ్యూసర్లు నష్టపోయిన కూడా కృష్ణ ఎంతో కొంత నష్టాన్ని భర్తీ చేసేవాడు. అలాగే వాళ్లకు ఇంకో సినిమా చేసుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పించేవాడు.
అలాంటి కృష్ణ ఒక నటుడి విషయంలో సైతం అతనికి హెల్ప్ చేయడం వల్లే ఆ నటుడు ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాను అంటూ కృష్ణ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరు అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కావడం విశేషం… ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ తో ప్రేక్షకులందరిని మెప్పించాడు.
ఇక ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమాలో తనకంటూ సపరేట్ క్యారెక్టర్స్ ని ఎంచుకొని అందులో తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు. అలాంటి నటుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తను ఎక్కడ ఉండాలో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు పద్మాలయ స్టూడియోలో కృష్ణను కలిశారట.
ఇక కృష్ణ అతని బాధలను విని ఆ స్టూడియోలోనే ఒక రూమ్ ఇచ్చి అందులోనే ఉండమని చెప్పారట. తనకి అవకాశాలు దొరికేంత వరకు అక్కడే ఉండమని చెప్పడంతో పృథ్వి అక్కడ ఉంటూనే అవకాశాల కోసం ఎదురు చూశారంట. ఇక అలాంటి క్రమంలోనే ఇప్పుడు నేను తింటున్న ప్రతి మెతుకు కూడా కృష్ణ గారు పెట్టిన బిక్ష అంటూ ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…
