Sunny Deol : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్ లో సన్నీ డియోల్ (Sunny Deol) nu హీరోగా పెట్టి జాట్ (Jaat) అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పటికే బాలీవుడ్ లో స్పెషల్ షోస్ ని వేశారు… ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మాస్ మసాలా సినిమాలు అక్కడి ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. కాబట్టి బాలీవుడ్ హీరోలందరూ తెలుగు దర్శకుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : తప్ప తాగి రోడ్డుపై స్టార్ హీరో వీరంగం… వీడియో వైరల్, అంతలోనే ట్విస్ట్
ఇక దానికి ఏ మాత్రం తగ్గకుండా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో జాట్ సినిమాను తెరకెక్కించారు. దాంతో యావత్ బాలీవుడ్ ప్రేక్షకులందరిని మెప్పించినట్టుగా తెలుస్తోంది. మొదటి షో తోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది…ఇక చాలా రోజుల తర్వాత సన్నీ డియోల్ ఒక భారీ క్యారెక్టర్ ను పోషించడమే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ లో తన స్టామినా ఏంటో చూపించాడు అంటూ ప్రేక్షకులంతా సన్నీ డియోల్ మీద ప్రశంసల వర్షమైతే కురిపిస్తున్నారు. గోపీచంద్ మలినేని లాంటి ఒక దర్శకుడు బాలీవుడ్ స్టార్ హీరోను డైరెక్షన్ చేయడమే కాకుండా ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని కూడా సృష్టించాడు.
మరి ఏది ఏమైనా కూడా రవితేజతో మూడు సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య బాబుతో ‘వీర సింహారెడ్డి’ సినిమాతో మరొక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వీటి తర్వాత ఆయన ఇప్పుడు చేసిన జాట్ సినిమా ఇండియన్ సినిమా ప్రేక్షకులను కూడా మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు… ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి మిగతా ప్రాంతాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
మొత్తానికైతే బాలీవుడ్ లో ఇప్పటికే ప్రీమియర్ షో వేశారు. ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు అద్భుతంగా ఉందని చెప్పడం ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతుంది… ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ కి భారీ వ్యూస్ అయితే దక్కాయి. ట్రైలర్ ని కూడా చాలా కొత్తగా కట్ చేశారు. మొత్తానికి జాట్ సినిమాతో గోపీచంద్ మలినేని మరొక సక్సెస్ ని అందుకున్నాడనే విషయం అయితే చాలా క్లారిటీ గా తెలుస్తోంది.
Also Read : ఆ విషయంలో వెనకబడ్డ పుష్ప సినిమా ప్రొడ్యూసర్స్..ఇలా అయితే కష్టమే…