Sunny Deol: ఇది సోషల్ మీడియా యుగం. మేటర్ ఏదైనా క్షణాల్లో పాకిపోతుంది. ఎవరైనా సెలబ్రిటీ తప్పు చేస్తూ కనిపిస్తే జనాలు ఏకిపారేస్తారు. కామెంట్స్ తో విరుచుకుపడతారు. స్టార్ హీరో సన్నీ డియోల్ ఇలానే దొరికిపోయారు. అర్ధరాత్రి మందు తాగి ముంబై రోడ్ల మీద తూలుతూ తిరుగున్న సన్నీ డియోల్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఓ నెటిజెన్… చూడండి బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ రోడ్ల మీద ఎలా హల్చల్ చేస్తున్నాడో. చూస్తుంటే మందు తాగినట్లు ఉన్నాడు, అని కామెంట్ చేసి వీడియో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోపై నెటిజెన్స్ విరుచుకుపడ్డారు. గదర్ 2 సక్సెస్ ని సన్నీ డియోల్ ఎంజాయ్ చేస్తున్నారని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు ఆయనకు బాధ్యత లేదు. ముందుకు బానిసయ్యాడు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అయితే మేటర్ వేరు. అది సినిమా షూటింగ్ లో భాగం జరిగిన సంఘటన. సన్నీ డియోల్ నెక్స్ట్ సఫర్ అనే టైటిల్ తో మూవీ చేస్తున్నారు. ఓ సన్నివేశం కోసం సన్నీ డియోల్ తాగి తూలుతున్నట్లు నటించాడు.
ఆ క్లిప్ వైరల్ చేస్తూ ఆయన నిజంగానే తాగి రోడ్ల మీద తిరుగుతున్నారని ప్రచారం చేశారు. సఫర్ మూవీ యూనిట్ పూర్తి వీడియో విడుదల చేయడంతో మేటర్ వెలుగులోకి వచ్చింది. ముందు వెనుక తెలుసుకోకుండా కామెంట్స్ చేసినవాళ్లు నాలుక కరుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫోటోలు, వీడియోల గురించి మాట్లాడే ముందు ఒకసారి వాస్తవాలు తెలుసుకోండని ఎన్ని సార్లు చెప్పినా జనాలు వినడం లేదు. రష్మిక మందాన ఫేక్ డీప్ వీడియో విషయంలో కూడా ఇదే జరిగింది.
నటుడు ధర్మేంద్ర కుమారులైన సన్నీ డియోల్, బాబీ డియోల్ కి ఇది బెస్ట్ ఇయర్. ఏళ్ల తరబడి మరుగున పడిపోయిన ఈ నటులు వెలుగులోకి వచ్చారు. రెండు దశాబ్దాల క్రితం సంచలన విజయం సాధించిన గదర్ చిత్రానికి సీక్వెల్ తీసి అంతకు మించిన విజయం సాధించాడు సన్నీ డియోల్. గద్దర్ 2 వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ రూ. 691 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక బాబీ డియోల్ నటించిన యానిమల్ బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. యానిమల్ లో బాబీ డియోల్ ప్రతి నాయకుడు రోల్ చేశారు. యానిమల్ రూ. 1000 కోట్ల మార్క్ దాటటం ఖాయం అంటున్నారు.
Afwaahon ka ‘Safar’ bas yahin tak #Shooting #BTS pic.twitter.com/MS6kSUAKzL
— Sunny Deol (@iamsunnydeol) December 6, 2023