Singer Sunitha: ఈమధ్య కాలం లో హీరోయిన్లు , స్త్రీలు ధరించే దుస్తులపై సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. శివాజీ హీరోయిన్స్ దుస్తుల పై చేసిన కామెంట్స్ దగ్గర నుండి ఈ ప్రస్తావన మొదలైంది. అక్కడి నుండి , ఇప్పటి వరకు ఎదో ఒక సందర్భంలో ఈ అంశం పై చర్చలు నడుస్తూనే ఉన్నాయి, ప్రముఖ స్థానాల్లో ఉన్న ప్రతీ సెలబ్రిటీ ఈ అంశం పై స్పందించారు. వారిలో రీసెంట్ గా సింగర్ సునీత కూడా ఉన్నారు. ఆమె మాట్లాడుతూ ‘నా దుస్తులు నా ఇష్టం అని కొంతమంది అంటున్నారు. అప్పుడు చూసేవాళ్లు కళ్ళు కూడా మా ఇష్టం , మా కళ్ళు అంటారు కదా’ అని సునీత చెప్పుకొచ్చింది. దీనిపై సోషల్ మీడియా లో తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి.
ఒక స్త్రీ అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేసావు? అంటూ ఆమె పై తీవ్రమైన విమర్శలు చేశారు. కొంతమంది అయితే హద్దులు దాటి ‘నా చెయ్యి ..నా ఇష్టం, ఎక్కడైనా చేతులు వేసుకోవచ్చా?’ అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సింగర్ సునీత కాసేపటి క్రితమే తీవ్రమైన కౌంటర్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నేను మాట్లాడే మాటలు మిస్ లీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కదా, దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను. ‘నా శరీరం ..నా ఇష్టం’ అనే స్లోగన్ అర్థం నాకు బాగా తెలుసు. దాని అర్థం ఒకరి కంట్రోల్ లో ఉండకోవడం , స్వతంత్ర భావాలు ఉన్న నేను , నా శరీరం నా ఇష్టం అని అన్నాను. చూసేవాళ్ళు నా కళ్ళు నా ఇష్టం అనుకుంటారు అన్నది , సమాజం లో అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి , వాళ్ళ గురించే నేను చెప్పాను. అంతే కానీ నా చెయ్యి , నా ఇష్టం అని ఎవరైనా అంటే , వాళ్ళ చేతులు విరగ్గొట్టడానికి ముందుండే వారిలో నేను ఒకరిని. కాబట్టి నా మాటలను వక్రీకరించండి , పూర్తిగా వీడియోలను చూడండి’ అంటూ చెప్పుకొచ్చింది సింగర్ సునీత. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
‘నా చేయి, నా ఇష్టం’ అంటే చేతులు విరగ్గొడతా: సునీత
‘నీ ఒళ్లు నీ ఇష్టమైతే.. వాడి కళ్లు వాడి ఇష్టం’ అనే తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని సింగర్ సునీత స్పష్టం చేశారు. తన బాడీపై తనకు హక్కు ఉందని చెప్పడమే దీని ఉద్దేశమని, సమాజంలోని ద్వంద్వ ప్రమాదాలను ఎత్తిచూపేందుకే తాను… pic.twitter.com/KEGRjM3Wyu
— ChotaNews App (@ChotaNewsApp) June 26, 2026
