Sunil : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం టర్బో ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా మే 3న థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో థియేటర్స్ లో కుమ్మేసింది. నటుడు సునీల్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించాడు. కాగా ‘ టర్బో ‘ చిత్రం ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ..
వైశాఖ్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా నటించిన ‘ టర్బో ‘ థియేటర్లలో మంచి ఆదరణ దక్కించుకుంది. రూ. 23 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ. 73 కోట్ల వసూళ్లను రాబట్టింది. కాగా ఇప్పుడు ‘ టర్బో ‘ చిత్రం ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది. టర్బో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ దక్కించుకుంది. ఆగస్టు 09 నుంచి ‘టర్బో’ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
కాగా థియేటర్లలో మలయాళం లో మాత్రమే ‘ టర్బో ‘ రిలీజ్ అయింది. కానీ ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ డబ్బింగ్ వర్షన్లు సోనీ లివ్ అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ సినిమాకి మమ్ముట్టి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. రాజ్ బీ శెట్టి, అంజనా జయ ప్రకాష్, శబరీష్ వర్మ, కబీర్ దుహాన్ సింగ్, నిరంజన్ అనూప్ కీలక పాత్రలు పోషించారు. క్రిస్టో జేవియర్ మ్యూజిక్ అందించారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
టర్బో కథ విషయానికి వస్తే .. జీప్ డ్రైవర్ గా చేసే టర్బో అలియాస్ జోస్(మమ్ముట్టి) క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు తన సొంత ఊరు ఉడుక్కి కి వస్తాడు. ఆ సమయంలో తన స్నేహితుడు జెర్రీ(శబరీష్ వర్మ) పై కొందరు దాడి చేస్తారు. వారి నుండి తన జోస్ ఫ్రెండ్ కాపాడుతాడు. ఇందులేఖ ను జెర్రీ ప్రేమిస్తుంటాడు. ఈ దాడికి అదే కారణం అని జోస్ తెలుసుకుంటాడు. జెర్రీ, ఇందులేఖ ని ఒకటి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంటి నుండి రహస్యంగా ఇందుని తీసుకొచ్చేస్తాడు జోస్.
అయితే ఇందుని ఇంటికి తీసుకొచ్చాక అసలు ఆమె ఎవరో నాకు తెలియదు అని జెర్రీ అంటాడు. దీంతో జోస్ పై కిడ్నాప్ కేసు నమోదు అవుతుంది. ఆ తర్వాత జోస్ చెన్నై వెళ్ళిపోతాడు. ఇందులేఖ కూడా చెన్నై లోనే ఉంటుంది. ఆమెను చంపేందుకు గ్యాంగ్ స్టర్ షణ్ముగ సుందరం ప్రయత్నిస్తుంటాడు. అసలు ఇందులేఖ తెలియదు అని జెర్రీ ఎందుకు చెబుతాడు? ఇందులేఖ ను జోస్ రౌడీల నుంచి ఎలా కాపాడుతాడు? బ్యాంక్ స్కామ్ మిస్టరీ ఏంటి? అనేవి ఈ సినిమాలో ప్రధాన అంశాలు.
ఈ చిత్రంలో సునీల్ విలనిజం ఫీక్స్ అని చెప్పాలి. అతని గెటప్, హావభావాలు మెప్పిస్తాయి. ఇక 70 ప్లస్ లో ఉన్న మమ్ముట్టి లుక్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్. కథలో వచ్చే ట్విస్ట్స్ కూడా అలరిస్తాయి. మమ్ముట్టి, సునీల్ అభిమానులు టర్బో చిత్రాన్ని తప్పకుండా ఓటీటీలో చూడాలి.
Web Title: Sunil and mammootty starer turbo otti release date fixed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com