Homeఎంటర్టైన్మెంట్Ghani: గని సినిమాలో సునీల్ శెట్టి, ఉపేంద్రల పాత్రలు ఇవే.. టీజర్​ ఎప్పుడంటే!

Ghani: గని సినిమాలో సునీల్ శెట్టి, ఉపేంద్రల పాత్రలు ఇవే.. టీజర్​ ఎప్పుడంటే!

Ghani: మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గని’. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తమన్​ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు,  పోస్టర్​లు అభిమానులకు అచనాలు రేకెత్తిస్తున్నాయి. దీనికి తోడు తమన్​ నేపథ్య సంగీతం ఎంతగానో ఆకట్టుకుంది.  మరోవైపు, ఈ చిత్రాన్ని డిసెంబరు 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ghani

తాజాగా, సునీల్​ శెట్టి, ఉపేంద్ర పాత్రలను పరిచయం చేస్తూ.. ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. వీరిద్దరూ విక్రమాదిత్య, విజయేంద్ర సిన్హా పాత్రలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్​ను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. కంచె చిత్రంతో రెండో సినిమాకే తనలోని నటుడికి ప్రాణం పోసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వరుణ్​. ఆ తర్వాత వచ్చిన లోఫర్​, ఫిదా, గద్దలకొండ గణేశ్​ చిత్రాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపించాయి. వెంకీ మామతో కలిసి ఎఫ్​ 2 సినిమాలో స్క్రీన్​ షేర్ చేసుకున్నారు వరుణ్​. ఇప్పుడు బాక్సింగ్​ ఛాంపియన్​గా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నో అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా లేదా తెలియాలంటే.. విడుదలయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version