Ghani: గని సినిమాలో సునీల్ శెట్టి, ఉపేంద్రల పాత్రలు ఇవే.. టీజర్​ ఎప్పుడంటే!

Ghani: మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గని’. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తమన్​ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు,  పోస్టర్​లు అభిమానులకు అచనాలు రేకెత్తిస్తున్నాయి. దీనికి తోడు తమన్​ నేపథ్య సంగీతం ఎంతగానో ఆకట్టుకుంది.  మరోవైపు, ఈ చిత్రాన్ని డిసెంబరు 3 వ తేదీన ప్రపంచ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 14, 2021 3:53 pm
Follow us on

Ghani: మెగాప్రిన్స్​ వరుణ్​ తేజ్​ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గని’. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తమన్​ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు,  పోస్టర్​లు అభిమానులకు అచనాలు రేకెత్తిస్తున్నాయి. దీనికి తోడు తమన్​ నేపథ్య సంగీతం ఎంతగానో ఆకట్టుకుంది.  మరోవైపు, ఈ చిత్రాన్ని డిసెంబరు 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

తాజాగా, సునీల్​ శెట్టి, ఉపేంద్ర పాత్రలను పరిచయం చేస్తూ.. ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. వీరిద్దరూ విక్రమాదిత్య, విజయేంద్ర సిన్హా పాత్రలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్​ను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. కంచె చిత్రంతో రెండో సినిమాకే తనలోని నటుడికి ప్రాణం పోసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వరుణ్​. ఆ తర్వాత వచ్చిన లోఫర్​, ఫిదా, గద్దలకొండ గణేశ్​ చిత్రాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపించాయి. వెంకీ మామతో కలిసి ఎఫ్​ 2 సినిమాలో స్క్రీన్​ షేర్ చేసుకున్నారు వరుణ్​. ఇప్పుడు బాక్సింగ్​ ఛాంపియన్​గా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నో అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా లేదా తెలియాలంటే.. విడుదలయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.