Sundarakanda Collection: ప్రస్తుతం టాలీవుడ్ ఒక్క హిట్టు..10 ఫ్లాపులు రేషియో తో తీవ్రమైన సంక్షోభం లో ఇరుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు తప్ప, అత్యధిక సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. జనాలు అసలు థియేటర్ వైపు చూడడమే మానేశారు. స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు కేవలం వాళ్ళ కోసం మొదటి వీకెండ్ లో థియేటర్స్ కి వెళ్లే వాళ్ళే తప్ప, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి కదిలి 8 నెలలు దాటిపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు సూపర్ హిట్స్ అయినప్పటికీ కూడా వాటి కలెక్షన్స్ కేవలం ఒక రేంజ్ కి మాత్రమే పరిమితం అవ్వడం తో బయ్యర్స్ భారీ లాభాలను చూడలేకపోయారు. ఇకపోతే నిన్న వినాయక చవితి సందర్భంగా నారా రోహిత్(Nara Rohit) హీరో గా నటించిన ‘సుందరకాండ'(Sundarakanda Movie) చిత్రం విడుదలైంది. చాలా కాలం తర్వాత నారా రోహిత్ నుండి వస్తున్న సోలో హీరో చిత్రమిది.
Also Read: హైపర్ ఆది.. ఎంత పనిచేస్తివి…
ఈ సినిమా పై మొదటి నుండి ఇండస్ట్రీ లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. దానికి తోడు విడుదలకు ముందు రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టేస్తుందని అంతా అనుకున్నారు. అందరూ అనుకున్నట్టు గానే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ ఆ టాక్ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొని రావడం లో ప్రభావం చూపలేదు. పండగ సెలవు అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన ఓపెనింగ్ వసూళ్లను రాబట్టింది. నారా రోహిత్ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది, అందుకే జనాలు ఆయన లేటెస్ట్ సినిమాల పై ఆదరణ చూపడం లేదు అని అనుకోవచ్చు. కానీ కనీస స్థాయి ఓపెనింగ్ అయినా వస్తుందని అనుకున్నారు.
కానీ ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండి మొదటి రోజు 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. పండగ కదా కనీసం కోటి రూపాయిల షేర్ అయినా వస్తుందని అనుకున్నారు. కానీ వరల్డ్ వైడ్ కలుపుకొని చూసిన కూడా కోటి రూపాయిల కంటే తక్కువే వచ్చాయి. పైగా ఈ చిత్రాన్ని బుధవారం రోజున విడుదల చెయ్యడం కూడా పెద్ద మైనస్ అయ్యింది. శుక్రవారం విడుదలయ్యే సినిమాలనే జనాలు ఆదరించని ఈరోజుల్లో బుధవారం విడుదల అవ్వడం పెద్ద సాహసమే. రెండవ రోజు కూడా ఈ చిత్రం పరిస్థితి ఇలాగే ఉంది. కనీసం వీకెండ్ లో అయినా వసూళ్లు పుంజుకుంటాయి లేదో చూడాలి.