Sumanth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. అక్కినేని నాగేశ్వరరావు(Nageshwara Rao) రొమాంటిక్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన బాట లోనే తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున (Nagarjuna ) సైతం వైవిధ్యమైన సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. అలాగే అక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను గత 40 సంవత్సరాల నుంచి తనే మోస్తూ వస్తున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ మూడోవ తరం వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ (Sumanth) కెరియర్ మొదట్లో మంచి సక్సెస్ లను అందుకున్నప్పటికి ప్రస్తుతం ఆయన ఆడపదడపా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే సుమంత్ 2004 వ సంవత్సరంలో కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక వాళ్ళ మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేకపోవడంతో 2005 వ సంవత్సరంలో వాళ్ళు విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి సింగిల్ గానే ఉంటున్న సుమంత్ రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సీతారామం (Seetharamam) సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్ కి తనకు మధ్య మంచి రిలేషన్ షిప్ ఉందని ప్రస్తుతం వాళ్లు సహజీవనం చేస్తున్నారని తొందరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు అయితే వస్తున్నాయి.
మరి ఈ విషయం పైన రీసెంట్ గా సుమంత్ స్పందిస్తూ తను రెండో పెళ్లి చేసుకోబోనని మృణాల్ ఠాకూర్ కి తనకు మధ్య ఎలాంటి సంబంధం లేదని సీతారామం సినిమా సమయంలో దిగిన ఫోటోని వైరల్ చేస్తూ ఇలాంటి కొన్ని వార్తలు రాస్తున్నారని సీతారామం సినిమా తర్వాత మృణాల్ ను తను కలిసింది లేదని తెలియజేశాడు. ఇక మొత్తానికైతే సుమంత్ తన రెండో పెళ్లి మీద క్లారిటీ ఇచ్చేశాడు.
దీంతో అతను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడింది…ప్రస్తుతం ఆయన అనగనగా అనే ఒక వెబ్ మూవీ చేశాడు. ఈ సినిమా ఈనెల 15వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటుగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మహేంద్రగిరి వారాహి(Mahendragiri Varahi) అనే సినిమా కూడా చేస్తున్నాడు.
ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలే కాకుండా మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు… ఇక ప్రస్తుతం సుమంత్ మరోసారి లైమ్ లైట్ లోకి రావాలి అంటే ఆయన మంచి సక్సెస్ సాధించాల్సిన అవసరమైతే ఉంది. మరి రాబోయే రెండు సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయన మార్కెట్ పెరుగుతుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…