Sumanth become a star hero : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ (Sumanth) వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఆయన స్టార్ హీరోగా మాత్రం మారలేకపోయాడు. ఆయన కెరీర్లో చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నప్పటికి ఆయన స్టార్ హీరోగా మారకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన చాలా రిజర్వుడ్ గా ఉంటారు, ఎవరితో ఎక్కువగా కలవరు, పెద్దగా బయట కనిపించరు. అందువల్లే ఆయన సెలెక్టెడ్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆయన కనక అన్ని రకాల జానర్లలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగితే ఆయనకు ఒక మంచి ఇమేజ్ అయితే ఏర్పడేది. దానివల్ల ఆయన స్టార్ హీరోగా మారడానికి కూడా అవకాశం అయితే ఉండేది. ఇక ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఆయన కి స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి. కానీ ఆయన మాత్రం చాలా సెలెక్టెడ్ గా సినిమాలను చేసుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.
కానీ భారీ రేంజ్ లో సినిమాలను చేయడానికి ఇష్టపడడం లేదు. అందువల్లే ఆయన మీడియం రేంజ్ హీరో గానే మిగిలిపోయాడు. మరి మొత్తానికైతే ఇకమీదట రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించి ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉందంటూ తన సన్నిహితులతో పాటు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.
Also Read : నాగార్జున గురించి చెప్పడానికి ఏమి లేదు..ఆయన అలాంటి వాడే : సుమంత్
ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయంటూ మరికొంతమంది అభిమానులు సైతం సుమంత్ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు… అక్కినేని ఫ్యామిలీ మూడోవ తరం హీరోల్లో సుమంత్ మొదటివాడిగా మంచి గుర్తింపును సంపాదించుకొని తన శైలిలో సినిమాలను చేసుకుంటూ సక్సెస్లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
50 సంవత్సరాల వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు ఏమాత్రం తీసుపోనీ విధంగా బాడీ ఫిట్నెస్ తో ఉండి మంచి సినిమాలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా అక్కినేని ఫ్యామిలీ లో నాగార్జున తర్వాత మంచి నటుడు ఎవర్సిన ఉన్నారు అంటే అది సుమంత్ అనే చెప్పాలి…