Anaganaga Deleted Scenes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు తీసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక అక్కినేని మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ (Sumanth) సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆయనకు కొంతవరకు ఫ్లాపులు రావడంతో కొద్ది సంవత్సరాల పాటు బ్రేక్ ఇచ్చాడు. మొత్తానికైతే ఇప్పుడు మరోసారి ‘అనగనగా’ అనే వెబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈనెల 15 వ తేదీ నుంచి ప్రముఖ ఓటు సంస్థ అయిన ఈటీవీ విన్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ మూవీ ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా రాజకీయ సినిమా ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. చాలామంది ఫ్యామిలీతో ఈ సినిమాని చూడాలి చెబుతున్నారు. ఎందుకంటే పిల్లల పట్ల పేరెంట్స్ ఎలా వ్యవహరించాలి, వాళ్ళ ఇష్టాలను ఎలా ఎంకరేజ్ చేయాలి అనే ధోరణిలో మంచి మెసేజ్ ఉన్న సినిమాగా ఈ సినిమాని కొనియాడుతున్నారు. మరి ఇప్పటివరకు సుమంత్ చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఈ సినిమా మరొకెత్తుగా మారింది…
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి డిలీటెడ్ సీన్స్ ను యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. డిలేటెడ్ సీన్స్ కి కూడా చాలా మంచి ఆదరణ అయితే దక్కుతోంది. ముఖ్యంగా డిలీటెడ్ సీన్ లో సుమంత్ కొడుకు నాన్న ఒక కథ చెప్పవా అని అడగగా దానికి సుమంత్ ముఫాసా, సింబా ల కథను చెపుతాడు. ఇక ఈ సీన్ చూసినవాళ్లు సైతం ఈ సీన్ ను ఎందుకు డిలీట్ చేశారు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు…
ఇక మొత్తానికైతే ఈ సినిమాని చూసిన ప్రేక్షకులకి డిలీటెడ్ సీన్స్ కూడా బాగా నచ్చాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సుమంత్ మరోసారి సక్సెస్ ను సాధించి తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పటివరకు సుమంత్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారుతుంటే సుమంత్ మాత్రం సెలెక్టెడ్ సబ్జెక్ట్ లను ఎంచుకొని సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…ఇక రాబోయే సినిమాలతో కూడా ఆయన మంచి విజయము సాధించి ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.