Suman Shetty Elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో కేవలం 5 వారాలు మాత్రమే కొనసాగగలిగే రేంజ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సుమన్ శెట్టి మాత్రమే. ఈయనతో పోలిస్తే హౌస్ లో ఉన్న ప్రతీ కంటెస్టెంట్ బెటర్ అని ఆడియన్స్ అంటుంటారు. మద్యమద్యలో కొన్ని కామెడీ పంచులు, అప్పుడప్పుడు కొన్ని టాస్కుల్లో మెరిశాడు కానీ, మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. మొదటి వారం లో ఎలిమినేట్ అయిన శ్రేష్టి వర్మ కూడా సుమన్ శెట్టి కంటే బెటర్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. కానీ ఇన్ని రోజులు ఆయన హౌస్ లో కొనసాగడానికి ముఖ్య కారణం మంచోడు, అమాయకత్వం ఉన్న మనిషి, మిగిలిన కంటెస్టెంట్స్ లాగా కన్నింగ్ ఆలోచనలు లేని మనిషి కాబట్టే ఇన్ని రోజులు హౌస్ లో ఆడియన్స్ అతనికి ఓట్లు వేస్తూ వచ్చారు.
అంతే కాకుండా ఇమ్మానుయేల్ 11 వారాలు నామినేషన్స్ లో లేకపోవడం కూడా సుమన్ శెట్టి కి బాగా కలిసొచ్చింది. ఆయన ఓటింగ్ అత్యధిక శాతం ఈయనకే పడుతూ వచ్చింది. గత వారమే ఈయన ఎలిమినేట్ అవ్వాల్సింది. కానీ కొన్ని సడన్ గా ప్లాన్ మార్చి రీతూ చౌదరి ని ఎలిమినేట్ చేశారు. ఇది సుమన్ శెట్టి కి కూడా బాగా నెగిటివి అయ్యింది. టాప్ 5 లోకి ఎంట్రీ ఇవ్వడానికి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న రీతూ చౌదరి ని కాదని, సుమన్ శెట్టి ని హౌస్ లో ఎలా కొనసాగిస్తారు?, ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున నెటిజెన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఎట్టకేలకు ఆయన ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఇతనితో భరణి, సంజన లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
శనివారం రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో సుమన్ శెట్టి, ఆదివారం రోజున టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో సంజన లేదా భరణి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సుమన్ శెట్టి ఒక పాపులర్ కమెడియన్ కాబట్టి, ఆయనకు రెమ్యూనరేషన్ కూడా ఆయన స్థాయికి తగ్గట్టే ఇచ్చినట్టు తెలుస్తుంది. రోజుకి 45 వేల రూపాయిల రెమ్యూనరేషన్ ఆఫర్ తో ఆయన హౌస్ లోకి వచ్చాడు. 14 వారాలు హౌస్ లో కొనసాగాడు కాబట్టి 44 లక్షల రూపాయలకు పైగా ఆయన రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. యాంకర్ రవి తర్వాత బిగ్ బాస్ హిస్టరీ లో ఆ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకున్న ఏకైక కంటెస్టెంట్ సుమన్ శెట్టి మాత్రమే. హౌస్ లో ఆడుతూ పాడుతూ 14 వారాలు లాకొచ్చాడంటే చిన్న విషయం కాదు. అదృష్టం ఆ రేంజ్ లో ఉందని చెప్పాలి.