Suma: బుల్లితెర టాప్ యాంకర్లలో ఒకరైన సుమ కనకాల నటించిన జయమ్మ పంచాయితీ సినిమా మే 6వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. “అందరికీ మామ చందమామ అందరికీ అక్క మన సుమక్క” అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ వినిపించగా సుమ నిద్రలో కూడా లేచిపడేంత అక్కలు వేశారు మీరు అని కామెంట్లు చేశారు.

డీప్ స్లీప్ లో ఈ వాయిస్ ఓవర్ ను వేస్తే ఉలిక్కిపడతానని సుమ కనకాల వెల్లడించారు. మీరు ఇన్నిసార్లు అక్క అక్క అని పిలిస్తే రాజీవ్ కూడా అక్క అని పిలుస్తాడని సుమ కామెంట్లు చేశారు. నేను ఔట్ స్టాండింగ్ యాంకర్ నని నాకు ఇలా కూర్చోవడం అస్సలు అలవాటు లేదని సుమ చెప్పుకొచ్చారు. ఎంతసేపూ నిలబడి ఏదో ఒకటి మాట్లాడాలని తనకు ఉంటుందని సుమ కామెంట్లు చేయడం గమనార్హం.
అనుష్క, రష్మిక, సమంత, సుమకనకాల అంటూ సుమ సరదాగా కామెంట్లు చేశారు. నాకు ఆరుగురు అత్తలు, 13 మంది బావలు అని సుమ చెప్పారు. నాన్న బ్రదర్స్ సిస్టర్స్ మొత్తం 10 మంది అని సుమ వెల్లడించారు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ అయినప్పుడు సుమ హీరోయిన్ అని అలీ చెప్పగా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే 30 ఏళ్లు అని హీరోయిన్ అంటే 16 ఏళ్లు అని సుమ కనకాల కామెంట్లు చేశారు. రాజీవ్ కు, తనకు మధ్య గొడవలు జరగడం వాస్తవమేనని సుమ అన్నారు.
ఈ 23 సంవత్సరాలలో ఎన్నోసార్లు గొడవ పడ్డామని సుమ కనకాల వెల్లడించారు. భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం సులువే కానీ తల్లీదండ్రులు విడాకులు తీసుకోవడం కష్టం అని సుమ కనకాల వెల్లడించారు. తనకు వయస్సు పెరిగేదేలే అంటూ సుమ షోలో సందడి చేశారు.
Also Read: TS Police Jobs: తెలంగాణ ఎట్టకేలకు కానిస్టేబుళ్ల నోటిఫికేషన్ విడుదల
Recommended Videos:
[…] Also Read: Suma: రాజీవ్ కనకాలతో గొడవలు నిజమే.. సుమ సం… […]
[…] High Temperatures: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కపోతక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫలితంగా ఎండ ధాటికి రోడ్లపై జనం కనిపించకుండా పోతున్నారు. ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గత 122 ఏళ్ల కాలంలో లేని వేడి ఈ సారి ఉంటోంది. దీంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ నుంచి ఉపశమనానికి కూలర్ల, ఫ్యాన్లు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోతున్నారు. మార్చి నెలలో నమోదైన సగటు ఉష్ణోగ్రత 33.10 డిగ్రీలుగా నమోదైంది. దీంతో వాతావరణంలో వస్తున్న మార్పుల ఆధారంగా సాధారణం కంటే 3.3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. […]
[…] Also Read: Suma: రాజీవ్ కనకాలతో గొడవలు నిజమే.. సుమ సం… […]
[…] Also Read: Suma: రాజీవ్ కనకాలతో గొడవలు నిజమే.. సుమ సం… […]
[…] Also Read:Suma: రాజీవ్ కనకాలతో గొడవలు నిజమే.. సుమ సం… […]