Chiranjeevi , Sukumar
Sukumar and Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా హీరోలను స్టార్లుగా మార్చడంలో దర్శకులు సైతం కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. వాళ్ళు రాసుకున్న కథలు అలాగే వాళ్ళు హీరోలను స్క్రీన్ మీద చూపించే విధానాన్ని బట్టి సినిమాలు ఆడతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) కి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. అందువల్లే ఆయనని చూసి ఇన్ స్పైర్ (Inspire) అయి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఆదరించి టాలెంట్ ను గుర్తించి ఇండస్ట్రీకి తీసుకొచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. తద్వారా వాళ్ళందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2(Pushpa 2) సినిమాతో పాన్ ఇండియాని శాసిస్తున్న దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ (Sukumar) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం కెరియర్ మొదట్లో చిరంజీవి అతన్ని నమ్మడం వల్లే తను ఆర్య (Arya) సినిమా చేయాగలిగాను అంటూ రీసెంట్ గా ఒక ఈవెంట్ లో తెలియజేయడం విశేషం… సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఆర్య సినిమా కథని మొదటగా చిరంజీవికి వినిపించారట. ఇక ఈ కథ విన్న చిరంజీవి బాగుందని చెప్పాడట. ఇక ఈ స్టోరీకి అల్లు అర్జున్ అయితే బాగుంటాడని సుకుమార్ చెప్పడంతో వెంటనే చిరంజీవి అల్లు అరవింద్ కి ఫోన్ చేసి కథ అద్భుతంగా ఉంది. దీనికి మన అర్జున్ సెట్ అవుతాడు అతనితో చేయించండి అని చెప్పారట.
అప్పుడు అల్లు అరవింద్ అతనికి ఏ మాత్రం డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేదు అతన్ని ఎలా నమ్మడం అని చెప్పడంతో చిరంజీవి చొరవ తీసుకొని ఆయన కథ చెప్పిన విధానం అద్భుతంగా ఉంది. ఎవరైతే కథను బాగా చెప్పగలుగుతారో వాళ్ళు అద్భుతంగా కథను తీయగలుగుతారు.
అందులో డౌటే లేదు అంటూ చిరంజీవి చెప్పడంతో ఆర్య సినిమా చేసే అవకాశం సుకుమార్ కి వచ్చింది. మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ చిరంజీవి పట్ల కృతజ్ఞత భావాన్ని తెలుపుతూనే ఉంటాడు. ఇక దానికి తగ్గట్టుగానే రామ్ చరణ్ తో రంగస్థలం లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ని తీసి చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ ని స్టార్ హీరోగా నిలబెట్టాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో సుకుమార్ కూడా చాలా వరకు కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇప్పుడు వరుస సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…