Sukumar : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి పాన్ ఇండియాలో స్టార్ డమ్ ను సంపాదించుకున్న దర్శకులు మాత్రం కొందరే ఉన్నారు. అందులో మొదటి స్థానంలో రాజమౌళి ఉండగా అతని తర్వాత స్థానంలో సుకుమార్ ఉన్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని చూపించడమే కాకుండా ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు…
‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్ (Sukumar)…ఈ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా డైరెక్టర్ గా భారీ గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఇక ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమాకి సంబంధించిన మొత్తాన్ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేస్తున్న పెద్ది సినిమా పూర్తి అయిన తర్వాత తన డేట్స్ మొత్తాన్ని సుకుమార్ సినిమా మీదకి కేటాయించే అవకాశాలైతే ఉన్నాయి. ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని పెంచేసినట్టుగా తెలుస్తోంది. ఇక పుష్ప సినిమాకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న సుకుమార్ ఇప్పుడు 100 కోట్ల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నారట. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. వరుసగా ఆయన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే సినిమాలను చేస్తూ వస్తున్నాడు. కారణం ఏదైనా కూడా వాళ్లకు తనకు మధ్య మంచి బాండింగ్ కుదరడంతో వాళ్ళ బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ ఉండటం విశేషం…
Also Read : సుకుమార్ ను ఫాలో అవుతున్న తన శిష్యులు…కారణం ఏంటంటే..?
ఇక మొత్తానీకైతే పుష్ప 2 సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించడంతో సుకుమార్ చాలావరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తన చేయబోయే సినిమాలతో తన స్టామినాను ప్రూవ్ చేసుకొని మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ అవ్వాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక 2000 కోట్ల మార్కును టచ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని సుకుమార్ బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఎవ్వరు చేయనటువంటి ఒక డిఫరెంట్ సబ్జెక్టులో ఆయన రామ్ చరణ్ ని చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్ సినిమా అంటే ప్రస్తుతం ఇండియా వైడ్ గా చాలా మంచి క్రేజ్ అయితే ఉంది.
కాబట్టి ఆ క్రేజ్ ను వాడుకోవడానికే ఆయన భారీ ఎత్తున ఇండస్ట్రీ హిట్ గా మలచాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును తెచ్చుకుంటాడు అనేది..
Also Read : సుకుమార్ పుష్ప సినిమా టైటిల్ పెట్టడం వెనక ఇంత కారణం ఉందా..?