Sukumar – Ram Charan combo : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ డైరెక్టర్లు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే ఉంటుంది. ఇక అలాంటి వారిలో సుకుమార్ ఒకరు… పాన్ ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరి లో తనకు ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. అలాంటి ఈ దర్శకుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్ (Sukumar)…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆర్య సినిమా నుంచి పుష్ప 2 (Pushpa 2) సినిమా వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైన కథాంశం అయితే ఉంటుంది. రామ్ చరణ్ చేసిన రంగస్థలం (Rangasthalam) సినిమా అతనికి గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా నాన్ బాహుబలి (Bahubali) ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆయన రామ్ చరణ్ తో మరో సినిమా చేయబోతున్నాడనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీ చేసే పనిలో తను బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ (Ram Charan) తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటాడా? సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : రామ్ చరణ్, సుకుమార్ సినిమాకు ‘మిషన్ ఇంపాజిబుల్’ స్ఫూర్తి..ఇలాంటి సినిమాలు మన టాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చుతాయా?
ఇక పుష్ప 2 (Pushpa 2) సినిమాతో బాహుబలి రికార్డును బ్రేక్ చేసినప్పటికి సుకుమార్ తన మార్కును చూపించలేకపోయాడు. పూర్తిగా ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి సినిమాను చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చే విధంగా ఈ సినిమాను చేశాడు. అందువల్లే ఈ సినిమా సక్సెస్ అయినప్పటికి ఆయన మాత్రం సంతృప్తిగా లేడనే తెలుస్తోంది.
మరి తర్వాత రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించి తన మార్కుతో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలను చేసిన కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తో చేయబోయే సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను 2026 సమ్మర్ నుంచి సెట్స్ మీదకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు..
ఇక పుష్ప 2 సినిమాతో కమర్షియల్ గా భారీ సక్సెస్ ను అందుకున్న ఆయన ఇక మీదట ఫ్లాప్ సినిమాలు చేయకూడదనే ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాయి. తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపును తీసుకొస్తాయి అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిగా వెయిట్ చేయాల్సిందే…