Sukumar not confident about Peddi movie: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా మీద ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. లెక్కల మాస్టారు సుకుమార్ మాత్రం ఈ సినిమాలో కొన్ని సీన్స్ ను చేంజ్ చేయాలని చెబుతున్నాడట. కారణం ఏంటి అంటే ఈ సినిమా మీద ఓవర్ హైప్ క్రియేట్ అయింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. కానీ ఒకటి రెండు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే ప్రేక్షకుడు మూవీకి పూర్తిస్థాయిలో కనెక్ట్ అయి రిపిటెడ్ గా థియేటర్ కి వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఆయన కొన్ని ప్యాచ్ వర్క్స్ చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా పెద్ది సినిమా రిలీజ్ కి మరొక నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపద్యంలో ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు.
మరి ఇప్పుడు మరోసారి ఒక చిన్న సీన్ కోసం ప్యాచ్ వర్క్ చేస్తున్నారట. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే తన శిష్యుడు అయిన బుచ్చిబాబు ను ఉప్పెనవసినిమా తర్వాత రామ్ చరణ్ దగ్గరికి తీసుకొచ్చింది.
ఈ సినిమాను సెట్ చేసింది సుకుమారే కాబట్టి మూవీ సక్సెస్ అయితేనే తనకి కూడా మంచి పేరు వస్తుంది. లేకపోతే మాత్రం ఆయన కూడా చాలావరకు బ్యాడ్ నేమ్ ని ముట్టగట్టుకునే పరిస్థితి రావచ్చు. అలాగే రామ్ చరణ్ ని మెప్పించిన ఘనత కూడా తనకే దక్కింది. కాబట్టి ఆయన నుంచి కూడా భారీ విమర్శలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…
అందుకే సుకుమార్ తన సొంత సినిమాని సైతం పక్కన పెట్టి పెద్ది సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ ని పెట్టాడు. ఎలాగైనా సరే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాబట్టి ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలుగుతుందా? లేదా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న…