సుకుమార్ కు తీవ్ర అస్వస్థత.. పుష్పకు బ్రేక్?

కరోనా లాక్ డౌన్ తో అన్ని సినిమాలు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే తెరిపినిచ్చి అన్నీ మామూలుస్థితికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ లు కూడా మొదలైపోయాయి. షూటింగ్ కు అంతా సిద్ధమైన వేళ దర్శకుడు సుకుమార్ కు తీవ్ర జ్వరం కారణంగా ‘పుష్ప’ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందట.. దర్శకుడు సుకుమార్ కు తీవ్రమైన జ్వరం కారణంగా ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారట.. ఇంగ్లీష్ మందులు సూదులు వాడితే వెంటనే తగ్గే అవకాశం ఉన్నా.. ఆయన […]

Written By: NARESH, Updated On : July 24, 2021 2:34 pm
Follow us on

కరోనా లాక్ డౌన్ తో అన్ని సినిమాలు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే తెరిపినిచ్చి అన్నీ మామూలుస్థితికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ లు కూడా మొదలైపోయాయి. షూటింగ్ కు అంతా సిద్ధమైన వేళ దర్శకుడు సుకుమార్ కు తీవ్ర జ్వరం కారణంగా ‘పుష్ప’ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందట..

దర్శకుడు సుకుమార్ కు తీవ్రమైన జ్వరం కారణంగా ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారట.. ఇంగ్లీష్ మందులు సూదులు వాడితే వెంటనే తగ్గే అవకాశం ఉన్నా.. ఆయన హోమియోపతి వాడుతున్నారట.. సో అది జ్వరం తగ్గడానికి సమయం పడుతుందని అంటున్నారు.

ప్రస్తుతం పుష్ప మూవీని రెండు పార్ట్ లుగా సుకుమార్ తీస్తున్నాడు. మొదటి పార్ట్ టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ఏడాది మొదటి పార్ట్ విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్ తో రెండో పార్ట్ విడుదల కాబోతోంది.

ఈ క్రమంలోనే తాజాగా కరోనా తగ్గడంతో సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి రెడీ కాగా తీవ్ర జ్వరంతో సుకుమార్ మంచాన పడ్డాడు. సో మరికొద్దిరోజుల విశ్రాంతి తర్వాత పుష్ప సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.