బాబోయ్.. ఇది మామూలు బూతు కాదు !

స్టార్‌ హీరోయిన్‌ శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా మెడకు చుట్టుకున్న అశ్లీల చిత్రాల ఉచ్చు ఇప్పట్లో వదిలేలా లేదు. నీలి నీడల మధ్యలో అతను చేసిన అకృత్యాల జాబితా ఒక్కోటి బయటకు వస్తుంటే.. ప్రేక్షకులు గుండె వణికిపోతోంది. ఇన్నాళ్లు నీతిగా బతికాను అంటూ ఫోజులు ఇచ్చిన ఈ హీరోయిన్ మొగుడు బాగోతం మరీ బూతు మయంగా మారిపోయింది. ఇతగాడు చాల ఏళ్లగా నీలి చిత్రాలు తెరకెక్కించి ఆన్‌ లైన్ లో కొన్ని సంస్థలకు అమ్ముకుంటూ బాగా […]

Written By: admin, Updated On : July 24, 2021 2:30 pm
Follow us on

స్టార్‌ హీరోయిన్‌ శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా మెడకు చుట్టుకున్న అశ్లీల చిత్రాల ఉచ్చు ఇప్పట్లో వదిలేలా లేదు. నీలి నీడల మధ్యలో అతను చేసిన అకృత్యాల జాబితా ఒక్కోటి బయటకు వస్తుంటే.. ప్రేక్షకులు గుండె వణికిపోతోంది. ఇన్నాళ్లు నీతిగా బతికాను అంటూ ఫోజులు ఇచ్చిన ఈ హీరోయిన్ మొగుడు బాగోతం మరీ బూతు మయంగా మారిపోయింది.

ఇతగాడు చాల ఏళ్లగా నీలి చిత్రాలు తెరకెక్కించి ఆన్‌ లైన్ లో కొన్ని సంస్థలకు అమ్ముకుంటూ బాగా డబ్బు చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఇది నిజమే అని నిరూపితం అవ్వడంతో రాజ్‌ కుంద్రాకి ఇక భవిష్యత్తు లేదనిపిస్తోంది. నిజానికి అతన్ని అరెస్ట్‌ చేసే సమయంలో ఇంత వ్యవహారం ఉందని ఎవరూ ఊహించలేదు.

ఇదేదో చిన్న చితకా వ్యవహారం అనుకుని ఈ కేసు పెట్టారు పోలీసులు. కానీ పరిస్థితి చూస్తుంటే ఇది మామూలు బూతు కాదు అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. రాజ్‌ కుంద్రాకి ఈ నీలి చిత్రాల నిర్మాణానికి ఏకంగా కోట్లలోనే డబ్బు వస్తోంది. ఈ విషయం రాజ్‌ కుంద్రా వాట్సప్‌ లో చాల స్పష్టంగా ఉందట.

అతని ఫోన్ ను చెక్‌ చేశారు పోలీసులు. రాజ్‌ కుంద్రా ఒక అంతర్జాతీయ సంస్థతో ఏకంగా 9 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని.. ఆ సంస్థ కోసమే నీలి చిత్రాలను నిర్మించే పనిలో పడ్డాడని పోలీసులు గుర్తించారు. ఇంతకీ ఆ సంస్థకు రాజ్‌ కుంద్రా ఎన్ని ఫోర్న్ వీడియోలు చేసి ఇస్తాను అని మాట ఇచ్చాడో తెలుసా ?

ఏకంగా 121 పోర్న్‌ వీడియోలు అట. బదులుగా ఆ సంస్థ అతనికి రూ. 9 కోట్ల రూపాయలు ఇస్తాను అంటూ ఒప్పందం కుదుర్చుకుంది.