Sandeep Reddy Vanga: తెలుగులో చాలామంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ సందీప్ రెడ్డి వంగ తను తీసిన మొదటి చిత్రం అయిన అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒక భారీ హిట్ ని అందుకొని ప్రతి క్రాఫ్ట్ లో కూడా తనదైన మార్క్ వేస్తూ ప్రత్యేక గుర్తింపు ని తెచ్చుకున్నాడు.ఇక శివ సినిమా తర్వాత తెలుగు మూవీస్ లో సౌండ్ లో గానీ, విజువల్స్ లో గానీ, అన్ని విభాగాల్లో చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఒక సూపర్ హిట్ అవ్వడానికి కారణం మాత్రం సందీప్ రెడ్డి వంగ అనే చెప్పాలి.
ఎందుకంటే అది కంప్లీట్లీ డైరెక్టర్ ఫిల్మ్ ఇక ఆయన ఒక్క సినిమా తోనే ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయ్యాడు.అయితే ఈ సినిమా తర్వాత ఆయన మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలి కానీ అది అనుకోని పరిస్థితుల వల్ల వర్క్ ఔట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఆయన బాలీవుడ్ లో ఎనిమల్ అనే సినిమా తీస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ఆయన ఎనిమల్ కి ముందు తమిళ్ సూపర్ స్టార్ అయిన విజయ్ తో ఒక సినిమా చేయాల్సి ఉండేది. కానీ ఈ విషయం మీద సందీప్ విజయ్ తో మాట్లాడుతూ నేను రాసుకునే కథలకి మీరు సెట్ అవ్వరు, మీకు సెట్ అయ్యే కథలు నేను రాయలేనని చెప్పి ఆయన విజయ్ ని రిజెక్ట్ చేసినట్టు గా అప్పట్లో తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో చాలా వార్తలు వచ్చాయి.
సందీప్ ఏది ఉన్న స్ట్రయిట్ గా చెప్పేస్తాడు. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి మాట్లాడకుండా ఏది ఉన్న ఓపెన్ గా మాట్లాడుతాడు కాబట్టి విజయ్ తో కూడా ఇలానే సమాధానం చెప్పడంతో ఆ సినిమా అనేది పట్టలెక్కలేదు.ఇక దాంతో ఆయన బాలీవుడ్ వెళ్లి అక్కడ ఎనిమల్ అనే సినిమా తీస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు…ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయితే మాత్రం ఆయన ఇండియా వైడ్ గా స్టార్ డైరెక్టర్ అయి పోతాడు…ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం అతనికి పోటీ ఇచ్చే డైరెక్టర్ ఎవరు అంటే సందీప్ రెడ్డి వంగ పేరు చెప్పడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…