భారత్ లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే బాగుంటుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను వాడటం మినహా మరో మార్గం లేదని భావిస్తున్నారు.
Also Read : తారల చీకటి బాగోతం: డ్రగ్స్ కేసులో వెలుగుచూస్తున్న సెక్స్ రాకెట్?
ఇప్పుడిప్పుడే కరోనా భయం ప్రజల్లో మెల్లగా తగ్గుతోంది. అయితే ఇదే సమయంలో చైనా ప్రజలకు మరో భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరో ప్రమాదకర వైరస్ చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు దేశాలకు వైరస్ వ్యాప్తి చెందిందని సమాచారం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది. దోమలు వాహకాలుగా ‘క్యాట్ క్యూ వైరస్’ మన దేశంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది.
క్యూలెక్స్ దోమ ద్వారా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనా వియత్నాంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ దోమల ద్వారా ఇప్పటికే భారత్ లోకి ప్రవేశించడం గమనార్హం. పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఐసీఎంఆర్ 883 సీరమ్ నమూనాలను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించాయి. ఈ పరిశోధనలో కర్ణాటకకు చెందిన ఇద్దరికి ‘క్యాట్ క్యూ వైరస్’ ద్వారా సీక్యూవీ వ్యాధి సోకి తగ్గినట్టు తేలింది.
దీంతో ఈ వైరస్ బారిన పడిన వారిని శాస్త్రవేత్తలు గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల కష్టాలు పడుతున్న ప్రజలు వైరస్ అనే పేరు వింటేనే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. గతేడాది వరకు సాధారణ జీవనం గడిపిన ప్రజలను వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి పెడుతున్న టెన్షన్ అంతాఇంతా కాదు.
Also Read : లాక్డౌన్ నష్టాలను పూడ్చుకుంటున్న రామోజీరావు?