Sukumar Pushpa 2: రాజమౌళిని బీట్ చేసే దర్శకుడు ఇండియాలో మరెవరు లేరనేది వాస్తవం… ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునేలా చేశాయి… ఇక ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో మరోసారి పాన్ వరల్డ్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు… సుకుమార్ లాంటి దర్శకుడు సైతం ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో భారీ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన ఆయన రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధిస్తే సైతం పాన్ వరల్డ్ లో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోతాడు… ఇక వీళ్లను పక్కన పెడితే కమర్షియల్ డైరెక్టర్ గా గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న అనిల్ రావిపూడి సైతం వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.
ఇక ఎలాంటి క్రమంలోనే అతని నుంచి వచ్చే సినిమాలు రొటీన్ గా ఉంటున్నాయని ప్రేక్షకులు కొన్ని విమర్శలను చేస్తున్నారు. రాజమౌళి సుకుమార్ సినిమాలు క్రియేటివ్ గా ఉండటమే కాకుండా విజువల్ వండర్స్ ను కూడా క్రియేట్ చేస్తున్నాయి. అనిల్ రావిపూడి సినిమాలు సక్సెస్ సాధించినప్పటికి అవి కొంతమంది జనాలకు మాత్రమే రీచ్ అవుతున్నాయి.
ఆయన తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేసి మాత్రమే సినిమాలను చేస్తున్నారని పాన్ ఇండియా సినిమాలను చేస్తే ఆయన తప్పకుండా ఫ్లాప్ ని మూట గట్టుకుంటారని చెప్పే వాళ్ళు సైతం ఉన్నారు… తెలుగు ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న క్రమంలో అనిల్ రావిపూడి నుంచి వచ్చే సినిమాలు ఇండస్ట్రీని భారీగా దెబ్బతీస్తున్నాయంటూ మరి కొంతమంది చెబుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి, సుకుమార్ ఒక స్ట్రాటజీ లో ముందుకు సాగుతుంటే, అనిల్ రావిపూడి మాత్రం రొటీన్ సినిమా అయిన పర్లేదు సక్సెస్ వస్తే చాలు అనే ఉద్దేశ్యంతో సినిమాలు చేస్తున్నాడు…