Pushpa: ‘పుష్ప- ది రైజ్’ సినిమా నిన్న గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. అయితే, మార్నింగ్ షో నుంచే పుష్ప పై ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ పడ్డాయి. ముఖ్యంగా పుష్ప సెకండాఫ్ లో బాగా తేలిపోయింది అని, అసలు స్క్రీన్ ప్లే విషయంలో ఏ మాత్రం బలంగా లేదు అని, ఇక చాలా సన్నివేశాలు అయితే, బాగా సాగదీసినట్టు ఉన్నాయని ఇలా చాలా రకాలుగా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.

పైగా పుష్ప నిడివి కూడా ఎక్కువగా ఉండటం అసలు కరెక్ట్ కాదు అని చాలామంది డైరెక్ట్ గానే విమర్శలు చేశారు. అయితే, ఈ విమర్శల పై పరోక్షంగా స్పందిస్తూ దర్శకుడు సుకుమార్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘పుష్ప’ మెయిన్ కథంతా పార్ట్-2లో ఉండనుందని, కేవలం పార్ట్ 2కి లీడ్ గా మాత్రమే పార్ట్-1 ఉంటుందని చెప్పుకొచ్చాడు.
అలాగే, పార్ట్ 2లోని మెయిన్ సీన్స్ కోసం పార్ట్ 1లో చాలా లీడ్ సన్నివేశాలను పెట్టాల్సి వచ్చిందని కూడా సుక్కు చెప్పాడు. పార్ట్ 2 గురించి సుక్కు మాటల్లోనే.. ‘కచ్చితంగా చెప్పగలను. పుష్ప పార్ట్ – 2 నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన పార్ట్ 1లో ఏ పాత్రలైనా కాస్త తగ్గినట్టు మీకు అనిపించొచ్చు. అయితే, అది నిజం కాదు. పార్ట్-2లో ఆ పాత్రలన్నీ బాగా ఎలివేట్ అవుతాయి.
Also Read: Kajal: ఆ విషయంలో ‘సమంత’ను ఫాలో అవుతున్న కాజల్ !
గుర్తు పెట్టుకోండి. పార్ట్-1లో ఉన్న పాత్రలే పార్ట్-2లో కూడా ఉంటాయి. అలాగే పార్ట్ 2లో మరో 3 కొత్త పాత్రలు యాడ్ అవుతాయి. ఇక ఫిబ్రవరి నుంచి పార్ట్-2 షూటింగ్ మొదలు పెడతాం’ అని సుకుమార్ ప్రకటించాడు. అలాగే పార్ట్ 2లో ఫహాద్ ఫాజిల్ నట విశ్వరూపాన్ని చూస్తారని కూడా క్లారిటీ ఇచ్చాడు.
ఇక వచ్చే ఏడాది ఇదే సమయానికి, అన్నీ బాగుంటే ఇంతకంటే నెల ముందే పుష్ప పార్ట్-2 రిలీజ్ అవుతుందని కూడా సుక్కు చెప్పాడు. అన్నట్టు పార్ట్-2లో యాంకర్ అనసూయ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట.
Also Read: Unstoppable: చిరు, బాలయ్య, మోహన్బాబులపై గాసిప్స్ బాగా మాట్లాడుకుంటాం- రాజమౌళి