Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్ ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ట్రేడ్ పండితుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆ హీరోలకు మంచి గుర్తింపు సంపాదించి పెట్టడంలో ఆయన సినిమాలు చాలా వరకు సక్సెస్ లను సాధిస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి బాహుబలి రికార్డును సైతం బ్రేక్ చేశాడు. ఇకమీదట చేయబోతున్న సినిమాల కోసం మంచి కథలను ఎంచుకొని ఇండస్ట్రీ రికార్డ్ లను మార్చాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన తన శిష్యులు ఇప్పుడు సినిమాలను చేస్తూ భారీ విజయాలను అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే బుచ్చిబాబు(Buchhi babu) ఉప్పెన (Uppena) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) ను హీరోగా పెట్టి ‘పెద్ది వ (Peddi) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేశారు. ఇక ఆద్యంతం మాస్ షాట్స్ ను ఎలివేట్ చేస్తూ ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లియర్ కట్ విజన్ అయితే చూపించారు. ఇక సుకుమార్ మరో శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదెల సైతం దర్శకుడిగా మారి దసర అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అతనికి దర్శకుడిగా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది.
Also Read : సుకుమార్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడా..?
ఇక ఇప్పుడు ఆయన మరోసారి నానితో ప్యారడైజ్ (Paradaise) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సైతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా గ్లింప్స్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ అయితే ఏర్పడబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26 వ తేదీన రిలీజ్ అవ్వబోతుండగా, పెద్ది సినిమా మార్చి 27వ తేదీన రిలీజ్ అవుతుంది. ఇక ఈ రెండు సినిమాల మధ్య ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండడంతో ఈ సినిమాల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుందంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి ఈ విషయంలోనే సుకుమార్ రంగంలోకి దిగి ఎవరినో ఒకరిని కాంప్రమైజ్ చేసి ఒక సినిమాని పోస్ట్ పోన్ చేయించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక సుకుమార్ చెబితే వీళ్ళిద్దరూ వింటారు కాబట్టి ఆయా ప్రొడ్యూసర్లు ఆయనతో వీళ్ళకు చెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : సుకుమార్ పుష్ప సినిమా టైటిల్ పెట్టడం వెనక ఇంత కారణం ఉందా..?