Sukumar Doing Arya 3 Young Hero : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు తమకంటూ ఒక స్టార్ స్టేటస్ ని పొందడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. కెరియర్ మొదట్లో సుకుమార్ (Sukumar) తన మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. అల్లు అర్జున్ (Allu Arjun) తో చేసిన ఆర్య సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన ప్రతి సినిమాతో మంచి విజయాలను సాధిస్తూ వచ్చారు. సుక్కు అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 (Arya 2) సినిమాతో విజయాన్ని సాధించలేదు. అయినప్పటికి పుష్ప సిరీస్ తో భారీ విజయాన్ని అందుకున్నారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడంలో వీళ్ళు కీలకపాత్ర వహిస్తూ వచ్చారు. మరి ఏది ఏమైన వీళ్ళు చేస్తున్న సినిమాలతో ఎలాంటి విజయాన్ని సంపాదించుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం ఆర్య 3 (Arya 3) సినిమాకు సంబంధించిన స్టోరీని కూడా సుకుమార్ (Sukumar) రాసుకున్నాడట. దీనికి సంబంధించిన స్టోరీ స్క్రీన్ ప్లే ని అందిస్తున్న సుకుమార్(Sukumar).
Also Read : సుకుమార్ టీమ్ లో రైటర్స్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడా..?దానికి కారణం ఇదేనా..?
ఈ సినిమాని దిల్ రాజు వాళ్ళ తమ్ముడు కొడుకు అయినా ఆశిష్ తో చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సుకుమార్ దగ్గర డైరెక్షన్ టీం లో వర్క్ చేసిన ఒక అబ్బాయి ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవ్వబోతున్నాడనే ప్రచారం అయితే జరుగుతుంది…
ఇక ఇది చూసిన కొంతమంది మాత్రం ఈ సినిమాకి అల్లు అర్జున్ తప్ప వేరే హీరో సెట్ అవ్వడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆశిష్ అయితే ఈ సినిమాకి అసలు సెట్ అవ్వడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు డల్ గా కనిపిస్తూ ఉంటాడు. యాక్టివ్ పర్ఫామెన్స్ ని ఇవ్వలేడు అల్లు అర్జున్ క్యారెక్టర్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆయన చేసే యాక్టింగ్ చాలా గొప్ప గా ఉండటం వల్ల ఆ సినిమా చాలావరకు ఎలివేట్ అయింది.
కానీ ఆ సినిమా ఫ్రాంచైజ్ ని ఆశిష్ మోయలేడు అనే ఉద్దేశంతో కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. మరి సుకుమార్ ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. తద్వారా ఈ సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…