https://oktelugu.com/

Sukumar and Mahesh Babu : సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా రాబోతుందా? ఎప్పుడు?

మహేష్ బాబు, సుకుమార్ కలిసిన కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని చాలా రోజులుగా సినీ ప్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వీరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చినా నేనొక్కడినే సినిమా ఫ్లాఫ్ అయినా ఆ సినిమా కు ఫాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 13, 2025 / 11:53 AM IST

    Sukumar , Mahesh Babu

    Follow us on

    Sukumar and Mahesh Babu : మహేష్ బాబు, సుకుమార్ కలిసిన కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని చాలా రోజులుగా సినీ ప్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వీరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చినా నేనొక్కడినే సినిమా ఫ్లాఫ్ అయినా ఆ సినిమా కు ఫాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆ సినిమాను ఇంకాస్తా బెటర్ గా తీస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని గతంలో సుకుమార్ కొన్ని ఇంటర్వ్యూ లో బాధపడ్డారు. మరోవైపు మహేష్ బాబు కూడా సుకుమార్ తో కలిసి సినిమా చేయాలన్న ఇంట్రస్ట్ తో ఉన్నారు అని టాక్.

    ఇదిలా ఉంటే మహేష్ బాబు కూడా నేనొక్కడినే సినిమా ప్లాఫ్ తో వన్స్ బాధపడుతూనే తను తీసిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అని అన్నారు. మహేష్ బాబు అన్నారు అని కాదు కాని ఆ సినిమా చుసిన అభిమానులు భలే బాగుంది అoటున్నారు. ఇప్పుడు కూడా థియేటర్ లో ఆడుతుంది అని ఫ్యాన్ మాట. అందుకే సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ మరో సినిమా రావాలి అని ఫాన్స్ వేటింగ్.

    అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో రెండో సినిమా వచ్చి మూడు సంవత్సరాలు గడిచేవి. పుష్ప సినిమా కంటే ముందే మహేష్ బాబుతో సినిమా ప్రపోజల్ చేశాడు మన లెక్కల మాస్టర్. కాని అప్పట్లో విరిద్దరూ కలిసి చేద్దామని అనుకున్న సినిమా అనుకోకుండా ఆగిపోయింది. అప్పుడే పుష్ప లైన్ లోకి వచ్చాడు సుకుమార్. అలా అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఈ గ్యాప్ లో మహేష్ బాబు అనిల్ రావిపొడి, పరుశురాం, త్రివిక్రమ్ వంటి దర్శకులతో పని చేసాడు. ఇక పుష్ప 2 తరువాత సుకుమార్ రేంజ్ వీర లెవెల్ లో పెరిగింది అని మనకు తెలిసిందే.

    ఇక మహేష్ బాబు, సుకుమార్ కలిసి సినిమా చేస్తే పండగే అంటున్నారు అభిమానులు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? తాజాగా సుకుమార్ భార్య తబిత సుకుమార్ నిర్మించిన గాంధీ తాత చెట్టు ట్రైలర్ ను మహేష్ విడుదల చేశాడు. ఆ మధ్య ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే వార్తలోచ్చా యి. కాని ఈ ట్రైలర్ చూశాక కలిసి పని చేస్తారేమోనని ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్ సినిమా ఊహించాలంటే కనీసం మూడేళ్లు వెట్ చేయాలి అభిమానులు. ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళితో సినిమా కమిట్ అయ్యాడు మహేష్ బాబు.

    ఇక రాజమౌళితో సినిమా అంటే మామూలుగా ఉండదు. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అందుకే రాజమౌళితో సినిమా తర్వాత మహేష్ డేట్స్ సుకుమార్ కు ఇస్తారు కావచ్చు. కానీ ఈ గ్యాప్ మాత్రం మూడు సంవత్సరాలు ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక మరోవైపు రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు సుకుమార్. ఈ గ్యాప్ లు ఫిల్ చేసిన తర్వాత సొక్కు, మహేష్ ల సినిమా వస్తుంది కావచ్చు. మరి ఈ కాంబినేషన్ లో సినిమా కలుస్తుందో లేదో చూడాలంటే మాత్రం వేయిట్ చేయాల్సిందే.