OG movie teaser : పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా వస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని సినిమా యూనిట్ యూనిట్ కాన్ఫిడెంట్ గా చెబుతుంది. ఇక ఇప్పటికే వచ్చిన ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఇప్పుడు ఈ సినిమా టీజర్ కోసం ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
దానికి సంబంధించి సినిమా దర్శకుడు అయిన సుజీత్ రాత్రి పగలు కష్టపడుతూ సినిమా టీజర్ ని రిలీజ్ చేయాలనే ఆత్రుత తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలోకి జాయిన్ అవడానికి ఇంకా మూడు నెలల సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు టీజర్ ని రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో చేయాలని అటెన్షన్ ను క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసమే ఒక నిమిషం 30 సెకండ్ల నిడివి తో ఒక అదిరిపోయే టీజర్ ని రిలీజ్ చేయాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దీనికి పవన్ కళ్యాణ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ జి సినిమా డబ్బింగ్ కోసం ఒక హాఫ్ డే కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఈనెల చివరి వారం లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక అలాగే వచ్చే నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి.
కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ టీజర్ సరికొత్త జోష్ నింపే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందు వచ్చిన “హంగ్రీ చీతా” లాగే ఈ టీజర్ కూడా అద్భుతాన్ని సృష్టిస్తుందేమో చూడాలి… ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు అనే విషయం మనకు తెలిసిందే…చూడాలి మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…