https://oktelugu.com/

Sudigali Sudheer: ప్రముఖ స్టార్ నిర్మాత కూతురితో సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్..ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!

హీరోగా ఇప్పటి వరకు మూడు సినిమాలు చేస్తే, అందులో 'గాలోడు' అనే చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే బుల్లితెర మీద సుడిగాలి సుధీర్, రష్మీ జోడి ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Written By: , Updated On : December 12, 2024 / 07:33 PM IST
Sudigali Sudheer

Sudigali Sudheer

Follow us on

Sudigali Sudheer: ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, నేడు ఇండస్ట్రీ లో అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న నటుడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షో కి ముందు సుడిగాలి సుధీర్ మ్యాజిక్ షోస్ చేసుకుంటూ తిరిగేవాడు. అలా ఒకరోజు ఆయన ‘బలగం’ వేణు దృష్టిలో పడడం, ఆయన జబర్దస్త్ లో తన టీంలోకి తీసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత సుడిగాలి సుధీర్ ప్రస్థానం తెలియని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరేమో. ఒకానొక దశలో సుడిగాలి సుధీర్ లేకపోతే జబర్దస్త్ లేదు, ఈటీవీ లో అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ లేవు అనే రేంజ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. యూత్ లో ఈయనకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. బుల్లితెర రారాజు గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో ఆయనకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ముందుగా కమెడియన్ గా పలు సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత హీరో అయ్యాడు.

హీరోగా ఇప్పటి వరకు మూడు సినిమాలు చేస్తే, అందులో ‘గాలోడు’ అనే చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే బుల్లితెర మీద సుడిగాలి సుధీర్, రష్మీ జోడి ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరు నిజంగా ప్రేమికులేమో అని అనిపించేంత కెమిస్ట్రీ వీళ్ళ మధ్య ఉంటుంది. వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని వందల కొద్దీ కథనాలు కూడా ప్రచారం అయ్యాయి. అయితే వీళ్లు మాత్రం కేవలం స్నేహితులు మాత్రమే, మా మధ్య అంతకు మించి ఏమి లేదు, కనీసం మేము ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోము అని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే సుడిగాలి సుధీర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త. ఒక ప్రముఖ నిర్మాత కూతురికి సుడిగాలి సుధీర్ బాగా నచ్చాడట.

ఈ నిర్మాత ఇండస్ట్రీ లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకరు. ఎంతోమంది స్టార్ హీరోలతో ఆయన సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ చేసి ఉన్నాడు. స్వయంగా ఆయనే సుడిగాలి సుధీర్ వద్దకు వెళ్లి తన కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడట. అందుకు సుడిగాలి సుధీర్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రథమార్థం లోనే ఈ పెళ్లి జరగబోతుంది అట. ఇంతకు ఎవరు ఆ ప్రముఖ నిర్మాత అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టారు. ఇక సుధీర్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈటీవీ లో ఆయన ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘ఫ్యామిలీ స్టార్స్’ అనే ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమా, ఇన్ని రోజులు గడిచినా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతానికి ఈ చిత్రం ఆగిపోయింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.