Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer Remuneration: కొత్త షోకు సుడిగాలి సుధీర్ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?

Sudigali Sudheer Remuneration: కొత్త షోకు సుడిగాలి సుధీర్ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?

Sudigali Sudheer Remuneration: జబర్దస్త్ షో ద్వారా ఎందరో కమెడియన్లుగా మారారు. తమ భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సెలబ్రిటీలుగా ారిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది తదితరులు ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు మల్లెమాలకు ఎంతో సేవ చేశారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో కుదరక వీరిద్దరు జబర్దస్త్ వీడినట్లు వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్ షో కు అంతటి ప్రాధాన్యం రావడానికి కారణం మాత్రం వారిద్దరే అని ఎవరైనా చెప్పకతప్పదు. ఈ నేపథ్యంలో వారు జబర్దస్త్ ను వీడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Sudigali Sudheer Remuneration
Sudigali Sudheer

సుడిగాలి సుధీర్ స్టార్ మా చానల్ లో సూపర్ సింగర్స్ జూనియర్ ప్రోగ్రామ్ కోసం అనసూయతో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు రెడీ అయ్యారు. హైపర్ ఆది మాత్రం ఏ షోలో కనిపించడం లేదు. దీంతో ఇద్దరు బెస్ట్ కమెడియన్లు జబరద్స్త్ షో ను వీడినట్లు తెలుస్తోంది. మల్లెమాల మంచి నటులను కోల్పోయిందని చెప్పొచ్చు. జబర్దస్త్ లో హైపర్ ఆది ఓ సంచలనమే సృష్టించారరు. తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే జబర్దస్త్ షోకు అంతటి విలువ వచ్చిందనేది సత్యమే. కానీ వారు ఇద్దరు షో నుంచి నిష్ర్కమించడంతో ఇక జబర్దస్త్ కు ఆదరణ తగ్గుతుందని తెలుస్తోంది.

Also Read: RRR Closing Collection: ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..!

గతంలో యాంకర్ అనసూయ కంటే సుధీర్ పారితోషికం తక్కువగానే ఉండేది. జబర్దస్త్ లో రెమ్యునరేషన్ తక్కువగా ఉందనే ఎక్కువ ఇవ్వాలని సుడిగాలి సుధీర్, హైపర్ ఆది డిమాండ్ చేస్తే కుదరదని చెప్పేశారట. దీంతోనే వారు ఈటీవీ నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం. సుధీర్ స్టార్ మాలో జాయిన్ అయ్యారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో వీరిద్దరు లేకుండా చూడటానికి ప్రేక్షకులు సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు. వారు ఉంటేనే కామెడీ పండి అభిమానులకు పంచులతో కనువిందు అయ్యేది. కానీ ఇప్పుడు వారిద్దరు దూరం కావడంతో ఇక జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ భవితవ్యం ఏమిటనేదే అంతుచిక్కని ప్రశ్న.

Sudigali Sudheer Remuneration
Sudigali Sudheer

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ కు స్టార్ మా చానల్ వారు ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల వరకు పారితోషికం ఇచ్చేందుకు సుముఖత చూపినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో సుడిగాలి సుధీర్ పారితోషికం పెరగడంతో మరిన్ని షోల్లో కూడా తన ప్రవేశం ఉండాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సుడిగాలి సుధీర్ అభిమానుల కోరిక మేరకు త్వరలో కామెడీ స్టార్స్ లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ ఇంతవరకు హైపర్ ఆది మాత్రం ఏ షో లో కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో హైపర్ ఆది ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఆయన అభిమానులు కూడా ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read:Telugu Indian Idol : తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా ఆమె.. చిరంజీవి చేతులమీదుగా ట్రోఫీ!
Recommended Videos

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular