Mount Kailash: కైలాసం.. ఈ పేరు వినగానే ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. దీనిపై అంత్యత రహస్య శక్తి ఉంది. దీనిపై దేవతలకు దేవుడైన మహాదేవుడు నివాసం ఉన్నట్లు భావిస్తారు హిందూ వాదులు. ఈ కారణంగానే ఇప్పటి వరకు ఎవరూ ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారని భావిస్తారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు కూడా కైలాస పర్వతం ఎక్కే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీనికి కారణం శిఖరం కొనపై ఉన్న రహస్య శక్తే కారణమని భావిస్తారు.

కైలాస పర్వతం మన పక్కనే ఉన్న టిబెట్‌లోని పర్వత శ్రేణి. దీని అంశం భారత దేశం నుంచి మొదలై చైనా వరకు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్టు ఎత్తు 8,848 మీటర్లు, కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు. ఎవరెస్టు శిఖరం కంటే దాదాపు రెండేవేల మీటర్లు తక్కువ. ఎవరెస్టు ఎక్కేవారు వారివెంట ఆక్సిజన్ తీసుకెళ్తారు. ఎందుకంటే పైకి వెళ్లేకొద్ది గాలిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. కానీ కైలాస పర్వతంపై అలాంటి ఇబ్బంది లేదు. అక్కడ సులువుగా ఆక్సీజన్ దొరుకుతుంది. మౌంట్ ఎవరెస్ట్‌ను ఇప్పటి వరకు 7 వేల మంది ఎక్కారు. కైలాస పర్వతం ఎత్తు ఎవరెస్టు కంటే 2 వేల మీటర్లు తక్కువ. అయినా దీనిని ఇప్పటి వరకూ ఎవరూ అధిరోహించలేదు. కనీసం సగం వరకూ కూడా వెళ్లలేకపోయారు. ఎక్కేందుకు ప్రయత్నించినవారు కూడా చనిపోయారు.
Also Read: Sudigali Sudheer Remuneration: కొత్త షోకు సుడిగాలి సుధీర్ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?
పురాణాల ప్రకారం శివుడు కొలువైయ్యాడు..
హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతంపై శివుడు కొలువై ఉన్నట్లు భావిస్తారు. ఈమేకు హిందూ ధర్మ గ్రంథాల్లో రాసి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే హిందూ ధర్మంలోని దేవీ దేవతలు వారు వేర్వేరు రూపాల్లో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. వారిని చూడడం మానవులకు సాధ్యం కాదు. అలాంటి ప్రత్యేక ప్రాంతమే కైలాస పర్వతంగా హిందువులు భావిస్తారు. ఇప్పటికీ ఈ శిఖరంపై పరమ శివుడు ఉన్నాడని భావిస్తారు. ఈ జన్మలో శివుడి దర్శన భాగ్యం ఉందో లేదో కానీ, అతడి నివాస దర్శన భాగ్యం మాత్రం ఉంది.
శిఖరం రహస్యంపై రీసెర్చ్…
ప్రపంచంలోని అన్ని అలౌకిక శక్తుల జన్మ ఈ కైలాస పర్వతం వద్దనే మొదలవుతుందంటారు. హిమాలయాల్లో ఉన్న ఈ పర్వతం ప్రపంచంలో పెద్దది కాకపోయినా దీని నవ్యత దీని ఆకారంలో ఉంది. ఈ పర్వతం ప్రాణమున్న శివలింగంలా కనబడుతుంది. ఒక రీసెర్చ్ టీం చేసిన పరిశోధనల ఆధారంగా కైలాస పర్వత కేంద్రం భూమికి కేంద్రం. ప్రతీ మనిశికి కేంద్రం నాభి. భూమికి నాభి ఈ శక్తివంతైమన కైలాస పర్వతం. అందుకే ఎవరైనా ఈ పర్వతం వద్దకు వెళితే అతడికి దిశానిర్దేశం చేసే యంత్రం పనిచేయదు. పరిశోధకుల ప్రకారం ఈ కైలాస పర్వతం వద్ద నాలుగు దిక్కులు కలుస్తాయి. పర్వతం భీమిపై ఉన్న అన్ని జీవులు జీవించడానికి అవసరమైన వాతావరణం ఏర్పరుస్తుంది. అందుకే దీనిని ప్రాకృతిక శక్తుల భాండాగారం అంటారు. ఇదివరకు ఈ పర్వతం ఎక్కేందుకు ప్రయత్నించిన వారికి ఒక హద్దు దాటిన తర్వాత అతనికి విచిత్రమైన, అసమాన్యమైన ఘటనలు జరుగుతాయి. అక్కడకి ఎక్కేందకు వెళ్లినవారు భయపడి వెనక్కి వస్తారు. అక్కడ ఏదో ఉంది.. పైకి రావొద్దు అన్న కంకేతం ఇస్తుంది. అక్కడ వాతావరణం కూడా అకస్మాత్తుగా మారుతుంది. చలి పెరుగుతుంది. గుండె వేగం రెండింతలు అవుతుంది. ఆక్సీజన్ ఉన్నా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అంతేకాదు కైలాస పర్వతం దగ్గరకు వెళ్లినప్పుడు గోళ్లు, తల వెంట్రుకలు వేగంగా పెరిగిన భావన కలుగుతుంది. ముఖంపై ముడతలు పడినట్లు అనిపిస్తుంది. వయసు వేగంగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ హెచ్చరికలను లెక్కచేయకుండా ముందుకు వెళ్లిన వారు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. హిందూ ధర్మం ప్రకారం కైలాసం శివుడి నివాసం. అతని అనుమతి లేకుండా ఎవరూ అక్కడకు వెళ్లలేరు అనేది మాత్రం నిర్ధారణ అయింది.

ప్రపంచమంతటా కైలాస గిరి గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. 1999లో రష్యాకు చెందిన వైజ్ఞానికుడు కైలాస పర్వత రహస్యం తెలుసుకునేందుక ఒక టీం ఏర్పాటు చేశాడు. అతను సుదీర్థ అధ్యయనం తర్వాత కైలాస పర్వతం ప్రాకృతికంగా ఏర్పడడం లేదని నిర్ధారణకు వచ్చాడు. దాని కొన పిరమిడ్ షేపులో ఉందని, దానిని మనిషి లేదా వేరే శక్తి ఏర్పాటు చేసిందని పేర్కొన్నాడు. ఇక్కడ అత్యధిక రేడియేషన్ ఉంటుంది. అందుకే దీనిని అలౌకిక శక్తుల పుట్టుక ప్రాంతంగా పేర్కొన్నారు. కౌలాసం నిర్మించింది శక్తి అని భావిస్తే దానిని ఏర్పాటు చేసింది వేరెవరో కాదు పరమ శివుడే. అందుకే అన్ని పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత కైలాస శిఖర అధిరోహాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే 2001లో చివరిసారి స్పెయిన్‌కు చెందిన ఓ బృందం దీనిని ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్రాంభం ఉత్సాహంగానే సాగింది. మధ్యలోకి వెళ్లిన తర్వాత వారు వెనక్కి వచ్చారు.
ఆ తర్వాత ఎవరూ ఎక్కే ప్రయత్నం చేయలేదు. భార త్‌తోపాటు టిబెట్, హిందూ దేశాల ప్రజలు కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తున్నాయి. మన సనాతన ధర్మంలో ఈ పర్వతానికి ఎంతో మహత్వం ఉంది. ఈరోజుకూ ప్రజలు అమర్‌నాథ్ యాత్రకు వెళ్లినప్పుడు కౌలాస పర్వంత కనిపిస్తుంది. దానిని చూడగానే భక్తితో నమస్కరిస్తారు. మానస సరోవరం వద్దకు వెళ్లగానే అక్కడ ఒక శబ్దం విబడుతుంది. అది విమానం వెళ్లినట్లు అనిపిస్తుంది. కానీ శ్రద్దగా వింటే అది ఢమరుకం, లేదా ఓంకారంలా అనిపిస్తుంది. వైజ్ఞానికులు మంచు కరగడం వలనే ఈ శబ్దం వస్తుందటారు. కానీ అది పూర్తిగా రహస్యం, మహిమానిత్వం. దేవతలకు నిలయమైన కైలాస పర్వతంపైకి బతికున్న ఎవరూ వెళ్లలేదు. జీవితంలో ఎంతో పుణ్యం చేసిన వ్యక్తులు చనిపోయిన తర్వాత కైలాస పర్యవతం చేరుకుంటారని నమ్మకం. ఈ పర్వతం వద్ద బ్రహ్మతాల్, రాక్షస తాల్ అనే రెండు సరస్సులు కూడా ఉన్నాయి. బ్రమ్మతాల్‌ను దర్శించుకోవడానికి ఎంతోమంది వస్తారు. దీని నిర్మాణం ఆకారం సూర్యుడిలా కనిపిస్తుంది. దీనికి కిలోమీటరు దూరంలో ఉన్న రాక్షస తాల్ చంద్రుడిలా ఉంటుంది. దీనివద్దకు ఎవరూ వెళ్లరు. బ్రహ్మతాల్ నీరు తియ్యగా, రాక్షస తాల్‌నీరు ఉప్పగా ఉంటుంది. ఈ కారణంగా కూడా బ్రహ్మతాల్ అనుకూల శక్తికి, రాక్షస తాల్ ప్రతికూల శక్తికి కేంద్రం. ఈ రెండు తాల్‌ల మధ్యలో ఉంది కౌలాస పర్వతం.
Also Read: Telugu Indian Idol : తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా ఆమె.. చిరంజీవి చేతులమీదుగా ట్రోఫీ!