Sudigali Sudheer: బుల్లితెర యాంకర్స్ కి మరియు కమెడియన్స్ కి సోషల్ మీడియా లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో లో ఉన్న కమెడియన్స్ నేడు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి టాలీవుడ్ లో టాప్ స్టార్ కమెడియన్స్ గా కొనసాగుతున్న వారు ఎంతో మంది ఉన్నారు..అలాంటి కమెడియన్స్ లో మనం ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి సుడిగాలి సుధీర్..ఈయనకి ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈయన క్రేజ్ ని కాష్ చేసుకుంటూ ఈటీవీ వారు ఎన్నో ఎంటెర్టైమెంట్ షోస్ ని కేవలం సుధీర్ కామెడీ టైమింగ్ మీద నడిపించేవారు..జబర్దస్త్ షో ఇప్పటికి మంచి రేటింగ్స్ తో నడుస్తుంది అంటే దానికి సుడిగాలి సుధీర్ కూడా ఒక్క కారణం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఢీ షో ని కూడా చాలామంది డాన్స్ చూడడానికి కంటే , డాన్స్ మధ్యలో వచ్చే సుధీర్ కామెడీ ని చూసేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది..కానీ ఎప్పుడైతే సుధీర్ ఈ షో ని వదిలేసాడో..రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.

హైపర్ ఆది మరియు యాంకర్ ప్రదీప్ తన టైమింగ్ తో ఈ షో ని నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎందుకో సుడిగాలి సుధీర్ లేని లోటు చూసే ప్రేక్షకులకు స్పష్టంగా కనిపిస్తుంది..రేటింగ్స్ కూడా పడిపోతూ ఉండడం తో మళ్ళీ సుడిగాలి సుధీర్ ని ఈ షో లో పార్టిసిపేట్ చేయించేందుకు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు సన్నాహాలు చేస్తున్నారు అట..ఇంతకు ముందుకంటే ఎక్కువ పారితోషికం ని మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు సుధీర్ కి ఆఫర్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది..గతం లో సుధీర్ కి ఒక్క ఎపిసోడ్ కి గాను దాదాపుగా రెండు లక్షల రూపాయిల చెక్ ని ఇచ్చేవారు..ఇప్పుడు ఆయనకీ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు ఏకంగా ఒక్క ఎపిసోడ్ కి గాను 5 లక్షల రూపాయిలు ఆఫర్ చేసారు అట..సుడిగాలి సుధీర్ కూడా దానికి ఒప్పుకొని ఈ షో లో పార్టిసిపేట్ చేసేందుకు గ్రీ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..అతి త్వరలోనే ఆయన గ్రాండ్ గా ఢీ సెట్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Also Read: RRR OTT: ఓటీటీ రాక పై మరో ట్విస్ట్.. ఎప్పుడు ? ఎక్కడో తెలిస్తే షాకే !
ప్రస్తుతం సుధీర్ ఈటీవీ లో జబర్దస్త్ షో తో పాటుగా ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కూడా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..వీటితో పాటు పలు సినిమాలలో కమెడియన్ గా కూడా చేస్తున్నాడు సుధీర్..కేవలం ఒక్క కామెడియన్ గా మాత్రమే కాదు..సుధీర్ కి హీరో గా వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి..ఇప్పటికే ఆయన సాఫ్ట్ వేర్ సుధీర్ మరియు 3 మంకీస్ వంటి సినిమాలతో హీరో గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే ..ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది..ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన గాలోడు మరియు కాలింగ్ సహస్త్ర వంటి సినిమాలలో నటిస్తూ హీరో గా మరోసారి తన అదృష్టం ని పరీక్షించుకోబోతున్నాడు..చూడాలి మరి ఈ సినిమాలతో అయినా హీరో గా సుధీర్ సక్సెస్ ని చూస్తాడా లేదా అనేది.
Also Read: KCR vs Governor: కేసీఆర్ వర్సెస్ గవర్నర్: అగ్నికి ఆజ్యం పోస్తున్న అసదుద్దీన్?
Recommended Videos:
[…] Jeevitha Rajasekhar: జీవితరాజశేఖర్ లపై చెక్ బౌన్స్ ఆరోపణలు విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. టాలీవుడ్లో కలకలం సృష్టించిన ఈ న్యూస్ వెనుక.. జోస్టార్స్ ప్రొడక్షన్స్‌కు చెందిన కోటేశ్వరరాజు, హేమ ఉన్నారు. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి.. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసమని తమ దగ్గర రాజశేఖర్ అప్పులు తీసుకున్నారనీ… ఇప్పుడు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనీ ఆరోపించారు. […]
[…] Minister Roja: జబర్దస్త్ జడ్జి రోజా ఇక మంత్రి కావడంతో ఇకపై ఆ షోకూ దూరం కానున్నారు. ఇన్నాళ్లు జబర్దస్త్ అంటేనే రోజాగా వినుతికెక్కిన ప్రోగ్రాం ఇక ఆమె లేకుండానే నెట్టుకు రానుంది. మంత్రి అయిన తరువాత బాధ్యతలు పెరుగుతాయని జబర్దస్త్ కు రావడం లేదని తెలుస్తోంది కానీ కమెడియన్లు అందరు ఆమె ఇక రాదని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు దైవంతో సమానమని ఏ తప్పు చేసినా తమను సొంత బిడ్డలుగానే చూసుకున్నారని విలపించారు. […]