Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer Aata Show Latest Episode Controversy: 'ఆట' షోలో సుడిగాలి సుధీర్...

Sudigali Sudheer Aata Show Latest Episode Controversy: ‘ఆట’ షోలో సుడిగాలి సుధీర్ పై రాధికా ఫైర్..సంచలనం రేపుతున్న వీడియో!

Sudigali Sudheer Aata Show Latest Episode Controversy: ప్రస్తుతం బుల్లితెర పై విజయవంతంగా నడుస్తున్న రియాలిటీ షోస్ లో ఒకటి ‘ఆట’. నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ డ్యాన్స్ షో , రీసెంట్ గానే జీ తెలుగు ఛానల్ లో మొదలై అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. అన్ని డ్యాన్స్ రియాలిటీ షోస్ లో లాగా కాకుండా, ఈ షోలో సామాన్యులకు డ్యాన్స్ చేసే అవకాశం కల్పించారు. ఎక్కడి […]

Sudigali Sudheer Aata Show Latest Episode Controversy: ప్రస్తుతం బుల్లితెర పై విజయవంతంగా నడుస్తున్న రియాలిటీ షోస్ లో ఒకటి ‘ఆట’. నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ డ్యాన్స్ షో , రీసెంట్ గానే జీ తెలుగు ఛానల్ లో మొదలై అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. అన్ని డ్యాన్స్ రియాలిటీ షోస్ లో లాగా కాకుండా, ఈ షోలో సామాన్యులకు డ్యాన్స్ చేసే అవకాశం కల్పించారు. ఎక్కడి నుండి వీళ్ళని పట్టుకొచ్చారో తెలియదు కానీ , ఒక్కొక్కరు డ్యాన్స్ చేస్తుంటే అసలు వీళ్ళ శరీరాల్లో ఎముకలు ఉన్నాయా, లేవా అనే ఫీలింగ్ కలుగుతోంది. ఇలాంటి డ్యాన్సర్స్ ని ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడలేదని ఈ షోని వీక్షించే ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, రాధికా , నిహారిక కొణిదెల , రఘు మాస్టర్ వంటి వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

Also Read: టోర్నీకి ముందే చెన్నై పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి.. ఎవరు కాపాడుతారు?

ఇదంతా పక్కన పెడితే నేడు జరగబోయే ఎపిసోడ్ లో సుడిగాలి సుధీర్ తో పాటు ఎన్నో ఏళ్ళ నుండి కెరీర్ లో ప్రయాణం చేస్తూ వచ్చిన ఆటో రామ్ ప్రసాద్ ఒక అతిథిగా విచ్చేశాడు. ఈయన షోలోకి రాగానే ఆటో పంచులు వదలడం మొదలు పెట్టాడు. అందుకు రాధికా బాగా సీరియస్ అవుతుంది. ఇది డ్యాన్స్ షో అనుకుంటున్నారా ?, ఇక వేరే ఏదైనా షో అనుకుంటున్నారా ?, అసలు ఏంటి ఆ పాట అంటూ రాధికా సీరియస్ అవుతుంది. అందుకు సుడిగాలి సుధీర్ భయపడుతూ, మేడం మీరు నిజంగానే ఫీల్ అయ్యారా అని అడుగుతాడు. అలా కాసేపు టెన్షన్ బిల్డ్ అవుతుంది. ప్లేయర్స్ గా వ్యవహరిస్తున్న విష్ణు ప్రియా , కావ్య వంటి వారు కూడా అసలు ఏమి జరుగుతోంది అంటూ షాక్ కి గురై అలా చూస్తూ ఉండిపోతారు.

అప్పుడు రాధికా సమాధానం చెప్తూ ’40 ఏళ్ళ నుండి ఈ ఇండస్ట్రీ లో ఉన్నాను. ఆ మాత్రం నటించలేనా ?’ అని అంటుంది. అందుకు రామ్ ప్రసాద్ ‘నాది ఏమి లేదు మేడం. ఈ ఎపిసోడ్ తర్వాత వెళ్ళిపోతాను, పాపం వీడి కెరీర్ ఏమైపోతుందో అని భయపడ్డాను’ అని అంటాడు. అలా చాలా సరదాగా సాగిపోతాది ఈ ఎపిసోడ్. జీ తెలుగు యాప్ లో ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ ని జీ5 యాప్ లో కూడా చూడొచ్చు. ఇకపోతే గత వారం ఆట షో లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పిలవబడే వారిలో ఒకరు బిట్టు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం కూడా అలాంటి బలమైన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper