https://oktelugu.com/

Sudigali Sudheer Marriage: సుడిగాలి సుధీర్ కు మళ్లీ పెళ్లి.. ఈసారి ఆ కొత్త అమ్మాయి ఎవరో తెలుసా?

Sudigali Sudheer Marriage: సుడిగాలి సుధీర్.. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ బుల్లితెరపై ఎవర్ గ్రీన్ కమెడియన్ కం యాంకర్ గా వెలుగొందుతున్నాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని తెలుగు నాట క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే సుధీర్ పెళ్లి అనేది ఇప్పుడొక మిస్టరీగా మారింది. అతడి పెళ్లి యాంకర్ రష్మీతో అవుతుందా? లేదా మరో అమ్మాయిని చేసుకుంటాడా? అసలు సుధీర్ పెళ్లికి ఎండ్ కార్డ్ ఎప్పుడన్నది ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారింది. ఒక మెజిషియన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 3, 2022 / 02:05 PM IST
    Follow us on

    Sudigali Sudheer Marriage: సుడిగాలి సుధీర్.. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ బుల్లితెరపై ఎవర్ గ్రీన్ కమెడియన్ కం యాంకర్ గా వెలుగొందుతున్నాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని తెలుగు నాట క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే సుధీర్ పెళ్లి అనేది ఇప్పుడొక మిస్టరీగా మారింది. అతడి పెళ్లి యాంకర్ రష్మీతో అవుతుందా? లేదా మరో అమ్మాయిని చేసుకుంటాడా? అసలు సుధీర్ పెళ్లికి ఎండ్ కార్డ్ ఎప్పుడన్నది ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారింది.

    Sudigali Sudheer Marriage

    ఒక మెజిషియన్ గా మొదలైన సుధీర్ ప్రస్థానాన్ని జబర్ధస్త్ షో మలుపుతిప్పింది. ఇప్పుడు సినిమాలు, రియాలిటీ షోలు, టీవీ కార్యక్రమాలతో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. పలు సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

    Also Read:  ‘వేణు ఉడుగుల’ వ్యభిచార కూపంలో ‘రాశి ఖన్నా’

    ఇప్పుడు సుధీర్ పెళ్లి ఎప్పటి నుంచో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈటీవీలో పలు కార్యక్రమాల్లో సుధీర్-రష్మీలకు పెళ్లి అంటూ హోరెత్తిస్తున్నారు. వీరిద్దరూ లవ్ లో ఉన్నారంటూ రూమర్స్ కూడా బయటకు వచ్చాయి.

    అయితే తాజాగా వచ్చిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రోమో అందరికీ షాక్ ఇచ్చింది. సుధీర్ కు పెళ్లి అంటూ ఒక చిన్న ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే అందరికీ షాక్ ఏంటంటే ఈసారి సుధీర్ పక్కన పెళ్లి చేసుకునే అమ్మాయి రష్మీ కాదు. ఒక కొత్త అమ్మాయి ఉండడంతో సుధీర్ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నాడేమో? ఆమెతో నిశ్చితార్థం జరిగిందేమోనని అందరూ అనుమానించారు. ఈసారి సుధీర్ పెళ్లి నిజంగానే ఫిక్స్ అయ్యిందని అనుకున్నారు.

    Sudigali Sudheer Marriage

    టీవీ షోల కోసం పాపం సుధీర్ కు పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసేస్తోంది మల్లెమాల టీం. అతడి పెళ్లితోనే షోకు పాపులారిటీ వస్తోందని ఇలా చేస్తుందేమో.. ఇది వరకూ రష్మీతో పెళ్లి చేశారు. ఇప్పుడు మరో అమ్మాయితో సుధీర్ కు లగ్నం చేశారు. సుధీర్ కు పెళ్లి తప్ప ఈ మల్లెమాలకు కొత్త ఐడియాలు దొరకడం లేదా? అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

    ఈ ప్రోమో వైరల్ కావడంతో ఇది కేవలం ఎపిసోడ్ కోసమేనని..సుధీర్ పెళ్లి ఆ అమ్మాయితో కాదని తెలుస్తోంది. ప్రోమోలో సుధీర్ పక్కనున్న అమ్మాయి పేరు తేజస్వి. ఆమె పలు షార్ట్ ఫిలింస్ లో నటించింది. తాజాగా ‘ఆహా’ ఓటీటీలో వచ్చిన ‘సామజవరగమన’లో కూడా నటించింది తేజస్విని. తనకు వచ్చిన ఈ ఆఫర్ ను ఉపయోగించుకొని గుర్తింపు తెచ్చుకుంటోంది. మరి ఈ కొత్త జోడి రష్మీ-సుధీర్ కాంబినేషన్ ను మరిపిస్తుందా? లేదా? అనేది చూడాలి.

    Also Read: ఐశ్వర్య రాయ్, త్రిష’ లుక్స్ తో అదరగొట్టిన లెజెండరీ డైరెక్టర్

    Recommended Video:

    Tags