Sudigali Sudheer latest viral video: బుల్లితెర పై ఎంటర్టైన్మెంట్ షోస్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటి సుడిగాలి సుధీర్. ఈయన కామెడీ టైమింగ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ సాధారణమైనది కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ చక్కగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేసేలా ఆయన కామెడీ ఉంటుంది. జబర్దస్త్ తర్వాత ఆయనకు మంచి పేరు తీసుకొచ్చిన షో ‘ఢీ’. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ డ్యాన్స్ రియాలిటీ షో లో ఒకప్పుడు డ్యాన్స్ తో పాటు కామెడీ స్కిట్స్ కూడా ఉండేవి. సుడిగాలి సుధీర్ , హైపర్ ఆది, రష్మీ వంటి వారు యాంకర్ ప్రదీప్ తో కలిసి చేసే కామెడీ అప్పట్లో పెద్ద హిట్. వాటి కారణంగా టీఆర్ఫీ రేటింగ్స్ కూడా బద్దలు అయ్యేవి. కానీ ఈమధ్య కాలం లో ఆడియన్స్ ఆ ఆర్గానిక్ కామెడీ ని ‘ఢీ’ షో లో మిస్ అవుతున్నారు.
కానీ ఇప్పుడు ఆ రేంజ్ కామెడీ ని ‘జీ తెలుగు’ ఛానల్ లో రీసెంట్ గానే మొదలైన ఆట షో లో మనం చూడొచ్చు. ఈ షో కి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. సుధీర్ తన వింటేజ్ కామెడీ టైమింగ్ తో ఈ షో లో చేస్తున్న కామెడీ బాగా క్లిక్ అవుతోంది. ఆ కారణం చేతనే ఈ షోకి బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ నమోదు అవుతున్నాయి. వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్స్ కి సంబంధించిన ప్రోమో ని ఇటీవలే విడుదల చేశారు. ఈ ప్రోమో కి ఆడియన్స్ నుండి మామూలు రేంజ్ రెస్పాన్స్ రాలేదు. ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా సినిమా వాళ్ళు ప్రొమోషన్స్ కోసం వచ్చారు. కోర్టు సినిమాతో భారీ హిట్ ని అందుకున్న హర్ష రోషన్ , శ్రీదేవి జంట మరోసారి కలిసి నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’.
కోనవెంకట్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా వచ్చిన రోషన్ , శ్రీదేవి , కోనవెంకట్ వంటి వారు సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన కామెడీ వేరే లెవెల్ లో ఉన్నింది. రోషన్ సుధీర్ తో మాట్లాడుతూ ‘తాళి కట్టడం అనేది కలిసి ఉండడం అయితే, మధ్యలో విడిచిపెట్టి వెళ్లిన దానికి కాదురా చిన్నప్పటి నుండి టీవీ లో చూస్తున్న నీకు కట్టాలి తాళి ‘ అంటూ సుధీర్ మెడలో వేస్తాడు. ఇక ఆ తర్వాత సుధీర్ ఇచ్చే రియాక్షన్స్ కి నవ్వులే నవ్వులు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.