Sudigali Sudheer- Jabardasth: సుడిగాలి సుధీర్ ని బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ ఆడియన్స్ ఆయన తిరిగి రావాలని కోరుకుంటున్నారు. లెజెండరీ కామెడీ షోగా నిలిచిన జబర్దస్త్ లో సుధీర్ టీమ్ ది తిరుగులేని హిస్టరీ. జబర్దస్త్ అంటే సుధీర్… సుధీర్ అంటే జబర్దస్త్ అన్నంతగా తన మార్క్ క్రియేట్ చేశారు. రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను వంటి టాలెంటెడ్ ఫెలోస్ సుడిగాలి సుధీర్ కి దొరకడం చాలా ప్లస్ అయ్యింది. ముగ్గురి కాంబినేషన్ సూపర్ గా సెట్ అయ్యింది. దీంతో సంచలనాలు చేశారు. హైపర్ ఆది టీమ్ వచ్చే వరకు సుడిగాలి సుధీర్ టీమ్ కి పోటీ ఇచ్చేవారే లేకుండా పోయారు.

సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కలిశారంటే నవ్వుల జాతరే. అంతగా అలరించిన టీమ్ ఒక్కసారిగా విచ్ఛిన్నమైంది. సుడిగాలి సుధీర్ మొదట షో వీడారు. సుధీర్ వెనకే గెటప్ శ్రీను వెళ్ళిపోయాడు. రామ్ ప్రసాద్ ఒంటరిగా మిగిలిపోయాడు. వీరిద్దరి నిష్క్రమణతో సుడిగాలి సుధీర్ టీం కళ పోగొట్టుకుంది. సుధీర్, గెటప్ శ్రీను లేకుండా స్కిట్స్ చేయడం నాకు కష్టమైపోతుందని రామ్ ప్రసాద్ బాధపడ్డారు.
సుధీర్ వెళ్లిపోవడానికి కారణం మల్లెమాల వాళ్లతో ఏర్పడిన విబేధాలే అని ప్రచారం జరిగింది. జబర్దస్త్ తో పాటు సుధీర్ ఈటీవీలో చేస్తున్న షోస్ మొత్తం వదిలేశారు. దీంతో జరుగుతున్న ప్రచారం నిజమే అని ప్రేక్షకులు నమ్మారు. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చారు. సుధీర్ స్వయంగా మాట్లాడారు. మల్లెమాలతో నాకు ఎలాంటి విబేధాలు లేవు.కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో అనుమతి తీసుకొని మానేశాను. మరలా తిరిగి వస్తానని చెప్పడం జరిగింది.

ఇటీవల మల్లెమాల సంస్థతో ఫోన్లో మాట్లాడాను. నేను తిరిగి రావడానికి సిద్ధమని చెప్పాను. వారు సానుకూలంగా స్పందించారు. ఓ కొత్త షో కూడా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. జబర్దస్త్ తో పాటు ఇతర టెలివిజన్ షోస్ నేను కొనసాగిస్తాను. హీరోగా అవకాశాలు వచ్చినప్పటికీ బుల్లితెరను వదలను, అని సుధీర్ స్పష్టంగా వెల్లడించారు. సుధీర్ లేటెస్ట్ కామెంట్స్ జబర్దస్త్ ఆడియన్స్ ని ఆనందంలో ముంచుతున్నాయి. ఇప్పటికే గెటప్ శ్రీను జబర్దస్త్ కి తిరిగి వచ్చారు. సుధీర్ కూడా వస్తే రచ్చ రచ్చే.