Calling Sahasra: ఒకప్పటి బుల్లితెర సూపర్ స్టార్ సుధీర్ హీరోగా మారిన విషయం తెలిసింది. సాఫ్ట్ వేర్ సుధీర్, ట్రీ మంకీస్, గాలోడు చిత్రాల్లో సుడిగాలి సుధీర్ హీరోగా నటించారు. గత ఏడాది విడుదలైన గాలోడు సూపర్ హిట్ టాక్ తెచుకుంది. సుధీర్ మాస్ హీరో రేంజ్ లో ఫైట్స్, సాంగ్స్, రొమాన్స్ ఇరగదీశాడు. గాలోడు చిత్రంలో సుధీర్ ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆయన రేంజ్ పెరిగింది. వరుస చిత్రాలు ప్రకటిస్తున్నాడు.
సుడిగాలి సుధీర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ కాలింగ్ సహస్ర. ఈ చిత్ర ప్రోమోలు, పోస్టర్స్ ఆసక్తి రేపాయి. సుధీర్ మొదటిసారి ఈ జోనర్ ట్రై చేస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న కాలింగ్ సహస్ర చిత్రంపై అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. మూవీ విడుదలకు సిద్ధం అవుతుందని తెలియజేశారు.
కాలింగ్ సహస్ర నిర్మాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ”నిర్మాతలుగా మాకు ఇది మొదటి చిత్రం. అందమైన అనుభవం మిగిల్చింది. డైరెక్టర్ అరుణ్, హీరో సుడిగాలి సుధీర్, హీరోయిన్ డాలీషా సహకారంతో మూవీ పూర్తి చేయగలిగాం. అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది. మీరు ఒక కొత్త సుధీర్ ని చూస్తారని చెప్పగలను. ఆయన క్యారెక్టర్ చాలా వైల్డ్ అండ్ మాసీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడుకుని ఉంటుంది.
సుధీర్ ఇలాంటి పాత్రలు కూడా చేస్తారా అని మీరు ఫీల్ అవుతారు. ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ అనుకోని మలుపులతో థ్రిల్లింగ్ గా సాగుతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. నవంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని” అన్నారు. కాలింగ్ సహస్ర మూవీ సుడిగాలి సుధీర్ కి మంచి చిత్రం అవుతుందనిపిస్తుంది. నిర్మాత కామెంట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.