గ్లింప్స్ అదిరిపోయింది. ముఖ్యంగా ఓపెనింగ్ షాట్స్ అయితే సినిమా పై అంచనాలు పెంచేశాయి. నదిలో ఏదో పడవ పందెం జరుగుతున్నట్లుగా ఉన్న ఆ షాట్స్, అలాగే ఓడలో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్న సుధీర్ బాబు లుక్స్ బాగున్నాయి. ఇక సుధీర్ బాబు తన సిక్స్ ప్యాక్ బాడీని కూడా చూపించి తనలో మాస్ హీరో ఉన్నాడనే విషయాన్ని మరోసారి గుర్తు చేశాడు.
అన్నట్టు ఈ గ్లింప్స్ లో మిగిలిన షాట్స్ తో పాటు తిరునాళ్లలో హీరో సిగ్గు పడటం, అలాగే అతని ప్రేమతో పాటు అతగాడి ఫైటింగ్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయని ఇన్ డైరెక్ట్ గా చూపించడం జరిగింది. కాకపోతే, హీరోయిన్ ఫేస్ ను మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. మరి ఆమెగారు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టరేమో. ఇక ఈ చిత్రానికి ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమా పై అంచనాలు ఉన్నాయి.
పైగా 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి మంచి చిత్రాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తుండటంతో ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతోంది. పైగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.