Fauji Movie Latest Updates: ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఫౌజీ'(Fauji Movie). ‘సీతారామం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా ఇది. రీసెంట్ గా ప్రభాస్ పుట్టినరోజు నాడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కి అభిమానులు సంతృప్తి చెందలేదు. అయితే స్టోరీ లైన్ మాత్రం అందరినీ ఆకర్షించింది. కర్ణుడు పాండవుల పక్షాన ఉంది పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు టాక్. ఇందులో ప్రభాస్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. ఒక ఇండియన్ ఆర్మీ కి చెందిన వాడు, పాకిస్తాన్ అమ్మాయి తో ప్రేమాయణం నడిపితే, ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి అనే నేపథ్యం లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు అనే రూమర్ కూడా ఉంది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అదేమిటంటే ప్రముఖ హీరో సుధీర్ బాబు రెండవ కుమారుడు దర్శన్ ‘ఫౌజీ’ చిత్రం లో ప్రభాస్ చిన్నప్పటి క్యారక్టర్ చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. ఇప్పటి వరకు మూవీ టీం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, రీసెంట్ గానే దర్శన్ పై కొన్ని ఆడిషన్స్ చేసారని, ప్రభాస్ తో పాటు, హను కి కూడా ఈ ఆడిషన్స్ నచ్చడం తో దర్శన్ ని ఫైనల్ చేసారని టాక్. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే దర్శన్ అడవి శేష్ హీరో గా నటిస్తున్న ‘గూడచారి 2’ లో నటించాడట. ఈ సినిమా నిర్మాణం లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో పాటు, మహేష్ బాబు కూడా నిర్మాణం లో భాగం పంచుకున్నాడు.
ఇది ఇలా ఉండగా సుధీర్ బాబు పెద్ద కొడుకు చరిత్ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. భలే భలే మగాడివోయ్ చిత్రం లో జూనియర్ నాని గా, విన్నర్ చిత్రం లో జూనియర్ సాయి ధరమ్ తేజ్ గా నటించాడు చరిత్. ఇప్పుడు ఆయన హీరో గా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే చరిత్ కి సంబంధించిన వర్కౌట్ వీడియోస్, స్తంట్స్ వీడియోస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమ్మో కుర్రాడు మామూలు టాలెంటెడ్ గా లేడుగా అని చాలా మంది కామెంట్స్ చేశారు. హీరో గా ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఒకే సమయం లో పెద్ద కొడుకు హీరో గా, చిన్న కొడుకు బాలనటుడిగా సుధీర్ ఫ్యామిలీ నుండి రాబోతున్నారు. ఇది కచ్చితంగా ఆయనకు ఎంతో స్పెషల్ అని చెప్పొచ్చు.