Rahul Ravindran about Prabhas: ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అని చెప్పేందుకు నిలువెత్తు ఉదాహరణ గా రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ని తీసుకోవచ్చు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం ఆయన ఎంత పెద్ద సూపర్ స్టార్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్క సినిమా చేస్తే కేవలం ఓపెనింగ్స్ తోనే 300 కోట్లు కొల్లగొట్టేంత కెపాసిటీ ఉన్న హీరో ఆయన. సాధారణంగా ఇలాంటి స్థానం లో ఉన్న హీరోలు చాలా బలుపు చూపిస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం తన తోటి నటీనటులతో ఒక సాధారణ మనిషి లాగానే వ్యవహరిస్తూ ఉంటాడు. తాను ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే విషయాన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. రీసెంట్ గా ఆయనతో కలిసి ‘ఫౌజీ'(Fauji Movie) చిత్రం లో నటించిన రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) ప్రభాస్ తో తన అనుభూతిని పంచుకున్నాడు.
రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ ”ఫౌజీ’ లో నా గెటప్ చాలా కొత్తగా ఉంటుంది. పూర్తిగా తెల్ల గెడ్డంతో నా కెరీర్ లో ఇప్పటి వరకు వెయ్యని పాత్ర అది. నాలుగైదు రోజులు షూటింగ్ లో పాల్గొన్నాను. అందులో ఒక రోజు ప్రభాస్ గారితో నా కాంబినేషన్ సన్నివేశం ఉంది. మా కాంబినేషన్ సమయం లో తెల్లవారు జామున మొదటి షాట్ నా మీదనే ఉంది. ప్రభాస్ గారు అప్పటికే వచ్చేసి ఉన్నారు కానీ, అప్పటికీ ఆయన మీద షాట్స్ ఆరోజు ఇంకా తెరకెక్కించలేదు. 9 గంటలకు ఆయన షాట్ రెడీ అయ్యింది, సెట్స్ లోకి వచ్చేసారు. మా ఇద్దరి కాంబినేషన్ లో షాట్ చిత్రీకరించేసారు. ఆ తర్వాత ప్రభాస్ డైరెక్టర్ హను వద్దకు వెళ్లి, ఇతన్ని నేను ఎక్కడో చూసినట్టు ఉంది, గుర్తుపట్టలేకపోతున్నాను అని చెప్పాడట. అప్పుడు నన్ను దగ్గరకు పిలిచి ఈయన నా మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ లో ఒక హీరో అండీ అని చెప్పగానే, ప్రభాస్ షాక్ కి గురై, రాహుల్ రవీంద్రన్ నా మీరు?, మీరు చూసేందుకు ఎంతో క్యూట్ గా ఉంటారు కదా, ఇదేంటి ఇలా అయిపోయారు అని అడిగాడు. మీ సినిమాలో నా క్యారక్టర్ గెటప్ అండీ ఇది అని చెప్పాను. ఆ తర్వాత నన్ను గుర్తుపట్టలేకపోయినందుకు ప్రభాస్ గారు ఆరోజు పది సార్లు క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత నేను ఒక దగ్గర కూర్చొని ఉంటే, వెనుక నుండి వచ్చి, ఏమి అనుకోకండి, ఆ గెటప్ లో మిమ్మల్ని గుర్తు పట్టలేకపోయాను అని అన్నాడు. అయ్యో పర్లేదు సార్, ఈ గెటప్ లో ఇంటికి వెళ్తే మా అమ్మ కూడా నన్ను గుర్తుపట్టలేదు అని చెప్పాను, చివరికి షూటింగ్ ముగిసి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మరోసారి క్షమాపణలు చెప్పాడు, అంత స్వీట్ పర్సన్ ప్రభాస్’ అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ రవీంద్రన్.
Rahul Ravindran Full Interview
Click Here : https://t.co/oXmnbYnXRB
ప్రభాస్ నన్ను గుర్తు పట్టలేదు
ఎవరు ఈయన అని హను ని అడిగారు.
ఆ తరవాత నాకు పది సార్లు నాకు సారీ చెప్పారు. pic.twitter.com/fhPk3TmVds
— Telugu360 (@Telugu360) October 28, 2025