Sudheer Babu: ఇండస్ట్రీ లో మంచి టాలెంట్, బ్యాక్ గ్రౌండ్ సపోర్టు ఉన్నప్పటికీ కూడా అదృష్టం కలిసి రాక కనీస స్థాయి మార్కెట్ ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయిన హీరోలలో ఒకరు సుధీర్ బాబు(Sudheer Babu). సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) బావ మరిదిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయనకు, కెరీర్ మొత్తం మీద ‘ప్రేమ కథా చిత్రమ్’ తప్ప మరో సూపర్ హిట్ సినిమా లేదు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడు లాగా కష్టపడి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘జటాధర’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతోంది. తెలుగు తో పాటు, హిందీ, తమిళం లో కూడా రేపే విడుదల కానుంది. ఈమధ్య కాలం లో విడుదలైన సుధీర్ బాబు సినిమాల్లో, కచ్చితంగా థియేటర్ కి వెళ్లి ఒకసారి చూడాలి అనిపించిన చిత్రం ‘జటాధర'(Jatadhara Movie).
ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే, కచ్చితంగా ఈ చిత్రం లో ఎదో విశేషం ఉంది. సుధీర్ బాబు ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనునుభూతి కలిగించడం కోసం ఎదో ఒక ప్రయత్నం అయితే చేసాడు. మారాయి ఆ ప్రయత్నం లో ఆయన సక్సెస్ అంటాడా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘ట్రైలర్ చూస్తుంటే సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేసినట్టుగా అనిపిస్తోంది, మరి మీకు అంత మార్కెట్ లేదు కదా, ఏ ధైర్యం తో మేకర్స్ అంత బడ్జెట్ ఖర్చు చేశారు?’ అని అడుగుతాడు. దీనికి సుధీర్ బాబు సమాధానం చెప్తూ ‘మార్కెట్ గురించి మీ థియరీ ని నేను నమ్మడం లేదు. కథ బలంగా ఉంటే, హీరో ఎవరైనా సరే, భారీ బడ్జెట్ పెట్టొచ్చు. బాహుబలి చిత్రానికి ముందు ప్రభాస్ పెద్ద హీరో నే, రాజమౌళి కూడా పెద్ద డైరెక్టర్. అయినప్పటికి వాళ్ళ ఇద్దరి మార్కెట్ ని కలిపి కూడా బాహుబలి బడ్జెట్ అంత చేయదు. అయినప్పటికీ వాళ్ళు ఆ సినిమా చేశారు. ఫలితం ఏంటో మనమంతా చూసాము. కథ బాగుంటే ఆడియన్స్ హీరో ఎవరైనా ఆదరిస్తారు, నిర్మాత కూడా భారీ బడ్జెట్ ఖర్చు పెట్టడానికి ముందుకొస్తాడు’ అని చెప్పుకొచ్చాడు సుధీర్ బాబు.
Correct ga cheppinav bhai idhi mathram @isudheerbabu pic.twitter.com/08Niqxeqxk
— Master (@arunkalyan5) November 6, 2025